ఢిల్లీ లో కొత్తగా నిర్మించిన పార్లమెంట్ లో వర్షాకాల సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా పార్లమెంట్ లో చర్చకు వచ్చిన చాలా విషయాలలో మణిపూర్ హింసకు సంబంధించిన అంశం కూడా చర్చకు వచ్చింది. కాగా తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం రేపు విపక్షాన నేతల కూటమి సభ్యులు అంతా కలిసి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలవనున్నామని మల్లిఖార్జున ఖర్గే విలేకరుల సమావేశంలో తెలియచేశారు. మల్లికార్జున ఖర్గే తో పాటుగా మొత్తం 21 మంది ఎంపీలు రాష్ట్రపతిని కావడానికి వెళుతున్నారు. ఈ మీట్ లో ప్రధాన అంశంగా మణిపూర్ రాష్ట్రం లో నెలకొన్న దారుణమైన పరిస్థితుల గురించి వివరిస్తారట. ఇంకా హర్యానా రాష్ట్రంలో చెలరేగిన మత ఘర్షణల గురించి కూడా ముర్ము కు వివరించడానికి విపక్షాల బృందం నిర్ణయించింది.
ఇంకా ప్రస్తుతం పార్లమెంట్ ఏ విధంగా సాగుతోంది… విపక్షలకు పార్లమెంట్ ద్వారా ఎదురైనా సమస్యలు గురించి కూడా రాష్ట్ర పతి దృష్టికి తీసుకువెల్లనున్నారు. మరి ఈ అంశాలను విన్న తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎలా స్పందిస్తారో చూడాలి.