తెలంగాణ నిరుద్యోగులకు కెసిఆర్ సర్కార్ శుభ వార్త చెప్పింది. ప్రభుత్వ వైద్య విద్యా కళాశాలల్లో కాంట్రాక్టు ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రంలోని తొమ్మిది ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 765 కాంట్రాక్టు అధ్యాపకులు మరియు వైద్యుల పోస్టులు మంజూరు అనుమతిస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
కొత్త పోస్టులు ఉస్మానియాలో 135, గాంధీ 135, కాకతీయ 135, మహబూబ్‌నగర్ 70, సిద్దిపేట 70, రిమ్స్ ఆదిలాబాద్ 70, సూర్యాపేట 40, నల్గొండ 40 పోస్టులు, నిజామాబాద్ 70 పోస్టులు వైద్య కళాశాలలకు మంజూరు చేశారు. ఈ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ మరో వారం రోజుల్లోనే విడుదల కానున్నట్లు ఆర్థిక శాఖ తమ స్పష్టం చేసింది. దీనిపై తదుపరి మార్గదర్శకాలను విడుదల చేయనుంది.
ఎంట్రన్స్ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారా?? ప్రభుత్వోద్యోగం మీ లక్ష్యమా.. అయితే Manalokam’s Vijayapatham.com వెబ్సైట్లో ప్రాక్టీస్ బిట్స్ , ఆన్లైన్ ఎగ్జామ్స్ ద్వారా మీ నాలెడ్జ్‌ను పెంచుకోండి. మరెన్నో ఇంట్రెస్టింగ్, వింతలు విశేషాలు, ప్రేరణాత్మక కథనాల కోసం మనలోకం.కామ్ ని ఫాలో అవ్వండి.