మనం మాట్లాడేందుకు చాలా వరకూ జంకే విషయాలన్నింటినీ కేసీఆర్ మాట్లాడతారు.మనం మాట్లాడేందుకు ఇష్టపడని విషయాలు అన్నీ కేసీఆర్ మాత్రమే విశ్లేషించి ఆర్థిక నేరాలన్నింటినీ వివరిస్తారు.మనం మాట్లాడేందుకు సిద్ధపడని విజయ్ మాల్యా లాంటి ఆర్థిక నేరగాళ్ల చిట్టానంతటినీ, ఈ విషయమై పార్లమెంట్ కు కేంద్రం సమర్పించిన నివేదికలన్నింటినీ వెలుగులోకి తెస్తారు కేసీఆర్. ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ వాకిట ఇప్పటిదాకా ఎదురులేని నేత. మన సమస్యలపై మాట్లాడే నేత.ఉభయ తెలుగు రాష్ట్రాలకు కావాల్సిన నేత.కొన్ని విషయాల్లో ఇష్టమయిన నేత కూడా!
ముఖ్యంగా ఇవాళ బీజేపీ గద్దెనెక్కాక ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తిస్తుంది అన్నది ఆయన మాట.సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించడం అన్నది భావ్యం కాదన్నది ఆయన మాట. అదేవిధంగా విభజన చట్టం ప్రకారం వెనుకబడిన శ్రీకాకుళం జిల్లాకూ నిధులు ఇవ్వాలని, రెండు తెలుగు రాష్ట్రాలనూ సమాన దృష్టితో చూసి న్యాయం చేయాలని పట్టుబడుతూ చెబుతున్న మాట
ఇక కేసీఆర్ అనే నాయకుడు ఉద్యమ కాలంలో ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలానే ఉన్నారు. భాషలో కాస్త ఉద్రిక్తత తగ్గింది.ఉద్వేగం ఎంత కావాలో అంతే వెల్లడికి వచ్చేలా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ జాతీయాలను ఆ రోజు ఏ విధంగా ఎంత సమున్నత రీతిలో వినియోగించారో ఇవాళ కూడా అదేరీతిన ఉపయోగిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో సాహిత్యం పై మంచి పట్టున్న నేత.
ఉమ్మడి రాష్ట్రం కన్నా ఎక్కువే సాయం చేసి తన ఉదారత చాటుకున్నారు. దాతృత్వం చాటుకున్నారు.మంచి గుణాలకు ప్రతినిధిగా నిలిచి ఇవాళ జాతీయ స్థాయిలో రాణించేందుకు సిద్ధం అవుతున్న తరుణాన సీఎం కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్ డే సర్.. ఇతరులెవ్వరూ చేయని విధంగా చేయలేని విధంగా ఇరు తెలుగు రాష్ట్రాల హక్కుల కోసం పోరాడండి సర్…