దీపావళి పై గురిపెట్టిన OTT..7సినిమాలు రిలీజ్…!

-

దసరాకు సినిమా హాళ్లు ఎక్కడ ఓపెన్ అవుతాయో అని ఓటీటీలు తెగ భయపడ్డాయి.ఈ భయంతో దీపావళికి వచ్చే సినిమాలను వరుసపెట్టి కొనిపడేశాయి. కొత్త సినిమాలను థియేటర్లలో చూడలేకపోయినా.. ఎంచక్కా ఓటీటీలలో చూసేసాం కదా అని ఆనందపడే నెటిజన్లు మార్కెట్లో చాలామందే ఉన్నారు.అలాంటి వారిని దృష్టిలో పెట్టుకునే సినిమాలకు ఫ్యాన్సీ ఆఫర్లు ఇచ్చాయి.

ఓటీటీలలో అంత పెద్ద సినిమాలేమీ రాకపోయినా చిన్నా చిత‌కా సినిమాల‌తో పాటు… వి, నిశ్శబ్దం, పెంగ్విన్‌ లాంటి మోస్తరు సినిమాలు వచ్చి మనల్ని అటు వైపుకు తిప్పుకునేలా చేస్తున్నాయి.వాటికొచ్చే ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ సినిమాల‌కు మ‌రీ దూర‌మైపోయామ‌న్న బెంగ‌ని ఓటీటీ వేదిక‌లు నిజంగానే త‌గ్గించాయి. తాజాగా దీపావళికి థియేటర్లకు వచ్చి ప్రేక్షకులను అలరించాల్సిన సినిమాలను కూడా తమ వేదికలపైకి తీసుకు వచ్చే ప్రయత్నాలలో ఉన్నాయి.త్వరలో ప్రముఖ ఓటీటీలలో దాదాపు 7 తెలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.

వీటిలో నవంబర్ 4న మిస్ ఇండియా వస్తుంది.నెట్ ఫ్లిక్స్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. అలాగే సూర్య `ఆకాశం నీ హ‌ద్దురా` సినిమాపై కూడా చాలా ఆశ‌లే ఉన్నాయి.న‌వంబ‌రు 12న అమేజాన్ లో ఈ ఫిలింను మనం చూడొచ్చు. అలాగే ఆనంద్ దేవ‌ర‌కొండ న‌టించిన `మిడిల్ క్లాస్ మెలోడీస్‌` ఈనెల 20న విడుద‌ల అవుతోంది.గ‌తం` అనే చిన్న సినిమాని అమేజాన్ లో న‌వంబ‌రు 6 నుంచి చూడొచ్చు.`మా వింత గాధ వినుమా,అన‌గ‌న‌గా అతిథి రెండూ… న‌వంబ‌రు 13న ఆహాలో రాబోతున్నాయి. ఇవి కాకుండా ఇత‌ర భాషా సినిమాలు మ‌రో ప‌ది వ‌ర‌కూ ఈ నెల‌లోనే ఓటీటీలలో విడుద‌ల అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news