మా వ్యాక్సిన్ అప్పుడే…!

-

కరోనా వైరస్ వ్యాక్సిన్ ని అమెరికన్ ఔషధ సంస్థ ఫైజర్ ప్రస్తుత సంవత్సరం ముగిసేలోపు అందిస్తుందని ఆ కంపెనీ పేర్కొంది. కంపెనీ సిఇఒ ఆల్బర్ట్ బౌర్లా సిబిఎస్ టెలివిజన్ నెట్‌వర్క్‌ కు ఇచ్చిన ఇంటర్వ్యులో దీనికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేసారు. అమెరికన్ మార్కెట్ లో అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని ఆయన చెప్పాడు. ఫైజర్ తయారు చేస్తున్న టీకా జర్మన్ కంపెనీ బయోఎన్‌టెక్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేయబడుతోందని పేర్కొన్నారు.

ప్రస్తుతం ఇది అమెరికాలో ఫేజ్ -3 ట్రయల్స్‌ లో ఉంది. “మేము (ఇప్పటికే) తయారీని ప్రారంభించాం. మేము ఇప్పటికే వందల వేల మోతాదులను తయారు చేసాం. ఫైజర్ గతంలో కూడా తన టీకాపై స్పందించింది. టీకా ప్రభావవంతంగా ఉందో లేదో అక్టోబర్ నాటికి తెలుస్తుంది అని పేర్కొంది. సీఈఓ కూడా ఇదే విషయాన్ని మీడియాకు వివరించారు. 60 శాతం క్లారిటీ వచ్చే నెలలో వస్తుందని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news