విశాఖలోని నర్సింగ్ హాస్టల్లో దారుణం చోటు చేసుకుంది. సెవెన్ హిల్స్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ హాస్టల్లో దారుణం జరిగింది. అర్దరాత్రి బాయ్ ఫ్రెండ్ ను కలవడానికి గోడ దూకి బయటకి వెళ్లేందుకు ప్రయత్నించింది ఓ విద్యార్థిని. అర్దరాత్రి 2 గంటల సమయంలో ఫుడ్ తీసుకురమ్మని చెప్పింది విద్యార్థిని. ఈ తరుణంలోనే… గోడ దూకే సమయంలో ట్రాన్స్ ఫార్మర్ పట్టుకుంది పశ్చిమ బెంగాల్ కు చెందిన స్నేహ దాస్. దీంంతో స్నేహకు హై ఓల్టేజ్ కరెంట్ షాక్ కొట్టి 50 శాతం గాయాలు అయ్యాయి. దీంతో మెరుగైన వైద్యం నిమిత్తం హాస్పటల్ కు తరలించారు.
విద్యార్ధిని పరిస్థితి విషమంగా ఉంది. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచేందుకు హాస్టల్ యాజమాన్యం ప్రయత్నం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. హాస్టల్ లో అసలు సీసీటీవీ లు..కనిపించడం లేదు. హాస్టల్ లో 150 మంది విద్యార్థినిలు ఉంటున్నారు. హాస్టల్ లోకి అబ్బాయిలు ప్రవేశం పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. హాస్టల్ పైనే ఓయో రూమ్స్ కూడా ఉన్నాయట. ఇక ఈ విషయం తెలియగానే ఘటనా స్థలానికి చేరుకున్న 4th Town పొలీసులు… దీనిపై విచారణ చేస్తున్నారు. అటు విద్యార్ధినుల భద్రతపై తల్లిదండ్రుల ఆందోళన చెందుతున్నారు.