అందరినీ ” పాగల్” చేయడానికి వస్తున్న విశ్వక్ సేన్

-

టాలీ వుడ్ మాస్ హీరో విశ్వక్ సేన్ గురించి ప్రత్యేక చెప్పనక్కర్లేదు. ఫలక్ నుమా దాస్, హిట్ సినిమాలతో యువతలో గుర్తింపు తెచ్చుకున్న హీరో విశ్వక్ సేన్. ప్రస్తుతం “పాగల్” పేరుతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా టీజర్ విడుదలైంది. టీజర్ ఆసక్తికరంగా ఉండడంతో అందరి చూపులు ఈ టీజర్ మీదకే వెళ్ళాయి. మరో మారు వైవిధ్యమైన ప్రేమకథని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాడంటూ అంచనాలు పెట్టుకున్నారు ప్రేక్షకులు.

సిమ్రాన్ చౌదరి, మేఘా లేఖ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. శనివారం విశ్వక్ సేన్ మూవీ ‘పాగల్’ను ఈ నెల 14న విడుదల చేస్తున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. ఈ మేరకు ‘పాగల్’ మూవీ రిలీజ్ డేట్‌కు అనౌన్స్‌మెంట్‌కు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో విష్వక్ సేన్ కూల్ లుక్‌తో చేతిలో ఎర్రగులాబీని పట్టుకుని చిరునవ్వు చిందిస్తూ కనిపిస్తున్నాడు. వెనుక పోస్టర్‌లో మబ్బుల నుంచి లవ్ సింబల్ కనిపిస్తుంది. అంటే సినిమా ప్రేమకథా చిత్రమని పోస్టర్ తెలియజేస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news