పెళ్ళికి వెళ్లి పెళ్లి కూతురి నగలే కొట్టేశారు !

Join Our COmmunity

మన వాళ్ళు కదా అని పెళ్ళికి పిలిచారు. కానీ వాళ్లు దొంగలు అన్న సంగతి తెలీదు. సైలెంట్ గా వచ్చారు, తమ చేతికి పని చెప్పారు. అయితే ఆ నగలలో పెళ్లి కూతురి నగలు కూడా ఉండడంతో కలకలం రేగింది. కామారెడ్డి జిల్లా జిల్లా కేంద్రంలోని అయ్యప్ప ఫంక్షన్ హాల్ లో జరిగిన పెళ్లిలో చోరీ జరిగింది. అది కూడా పెండ్లి కుమార్తె, ఆమె బంధువులకు సంబంధించిన  మూడు తులాల బంగారాన్ని ఒక జంట దొంగిలించింది.

thief
thief

 

వీళ్ళు దొంగతనం చేయడం గమనించి బంగారం దొంగిలించిన దంపతులను పెళ్లికి హాజరైన వారు పట్టుకున్నారు. బంగారం దొంగిలించిన దంపతులను చితకబాది పోలీసులకు అప్పగించారు స్థానికులు. బంగారాన్ని దొంగిలించిన దంపతులు ఇందిరా నగర్ కాలనీకి చెందిన పరమేశ్, యశోదలుగా గుర్తించారు. పోలీసులు సొత్తు స్వాధీనం చేసుకుని వారిని అరెస్టు చేశారు

TOP STORIES

ఐఓఎస్ ఫేస్‌బుక్ యూజ‌ర్ల‌కు స‌మ‌స్య‌లు.. లాగిన్ అవ‌డంలో ఇబ్బంది..

వాట్సాప్ కార‌ణంగా ప్ర‌స్తుతం అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్న దాని మాతృసంస్థ ఫేస్‌బుక్‌కు ఇప్పుడు సాంకేతిక స‌మ‌స్య‌లు ఎదుర‌వుతున్నాయి. ఫేస్‌బుక్‌కు చెందిన ఐఓఎస్ యాప్‌ను వాడుతున్న యూజ‌ర్ల‌కు...
manalokam telugu latest news