పాకిస్తాన్ లో ఆర్థిక సంక్షోభం.. క్రీడా మంత్రి అయిన ఫాస్ట్ బౌలర్

-

పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోన్న సంగతి తెలిసిందే. నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతుండడంతో ప్రజలు ఆకలి కేకలతో అలమటిస్తున్నారు. మరోవైపు విదేశీమారక నిల్వలు కనిష్టస్థాయికి పడిపోవడంతో దిగుమతులపై భారం పడుతుంది.

ఇలాంటి పరిస్థితుల్లో దేశాన్ని తిరిగి గాడిన పెట్టేందుకు ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. అందులో భాగంగా పాక్ సీనియర్ క్రికెటర్ వహాబ్ రియాజ్ ను క్రీడామంత్రిగా నియమించింది.

మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మద్దతుగా ఉన్న పంజాబ్ ప్రావిన్స్ లోని రాష్ట్ర ప్రభుత్వాన్ని గతంలోనే రద్దు చేసిన షేహబాజ్ ప్రభుత్వం అక్కడ తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తాజాగా అక్కడి గవర్నర్ రెహమాన్ ఈ ప్రభుత్వంలో తాత్కాలికంగా ఓ మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో పాక్ సీనియర్ పెసర్ రియాజ్ కు క్రీడా శాఖ మంత్రిగా పదోన్నతి కల్పించారు.

Read more RELATED
Recommended to you

Latest news