2023 వన్డే వరల్డ్‌కప్‌ను బాయ్‌కాట్ చేస్తామని BCCIకి పాక్ వార్నింగ్ ఇచ్చింది. పాకిస్తాన్ వేదికగా వచ్చే ఏడాది జరగనున్న ఆసియా కప్-2023 లో భారత్ జట్టు పాల్గొనబోదని కుండబద్దలు కొట్టాడు జైషా. ఐతే జైషా వ్యాఖ్యలపై పాకిస్తాన్ అభిమానులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వచ్చే ఏడాది టీమిండియా ఆసియా కప్ ఆడేందుకు పాకిస్తాన్ రాకపోతే అదే ఏడాది జరగనున్న వన్డే వరల్డ్ కప్ 2023 బాయ్ కాట్ చేయాలని పిసిబికి సూచనలు ఇస్తున్నారు. అంతేకాదు జైషా అధ్యక్షుడిగా ఉన్న ఎసిసి నుంచి కూడా తప్పుకోవాలని యోచనలో పిసిబి ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక పిసిబి కూడా జైషా వ్యాఖ్యలపై అసంతృప్తి వ్యక్తం చేసింది. టి20 వరల్డ్ కప్ ముగిసిన అనంతరం మేల్ బోర్న్ లో జరగనున్న ఐసీసీ సభ్య సమావేశంలో జైషా చేసిన వ్యాఖ్యలను దృష్టికి తీసుకువస్తామని పిసిబి ప్రతినిధి ఒకరు తెలిపారు.ఇక వన్డే వరల్డ్ కప్ 2023 కి భారత్ ఆతిధ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే. ఎసిసి అధ్యక్ష హోదాలో ఉండి ఒక దేశం తరపున మాట్లాడటం సరికాదని అభిమానులు మండిపడుతున్నారు.