ఆసియా కప్ లో భాగంగా పాకిస్తాన్ రెండు భారీ దెబ్బలు తగిలాయి.. ఈ టీం కీలక బౌలర్లు అయిన హరీష్ రాఫ్ మరియు నసీం షా లకు గాయాలు కావడంతో ఆఖరి రెండు మ్యాచ్ లకు దూరం అయ్యారు. ఈ కారణముగా పాకిస్తాన్ కనీసం ఆసియా కప్ ఫైనల్ కు కూడా చేరడంలో విఫలం అయింది. ఇక హరీష్ రాఫ్ కోలుకుని వరల్డ్ కప్ కు రెడీ అవుతుండడంతో… నసీం షా కు తగిలిన గాయానికి కొన్ని నెలల పాటి విశ్రాంతి అవసరం కావడంతో వరల్డ్ కప్ కు దూరం అయ్యాడు. ఇప్పుడు లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం నసీం షా స్థానంలో బౌలింగ్ ఆల్ రౌండర్ హాసన్ అలీని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఎంపిక చేసింది. హాసన్ అలీ వేగంగా మరియు లైన్ అండ్ లెంగ్త్ తో బౌలింగ్ వేయగలగడమే కాకుండా, అవసరం అయిన సమయంలో బ్యాట్ తోనూ రాణించగలరు. గతంలో చాలా సార్లు ఆఖరి ఓవర్ లలో విలువైన పరుగులు చేసిన ఘనత హాసన్ అలికి ఉంది.
మరి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు హాసన్ అలి పైన పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటాడా లేదన్న అన్నది తెలియాలంటే వరల్డ్ కప్ మొదలు అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.