పాకిస్తాన్ సుప్రీం కోర్ట్ కు చేరిన ఇమ్రాన్ ఖాన్ పంచాయతీ..

-

పాకిస్తాన్ లో రాజకీయ సంక్షోభం గంటకో మలుపు తిరుగుతోంది. అటు తిరిగి ఇటు తిరిగి పాక్ సుప్రీం కోర్ట్ కు చేరింది ఇమ్రాన్ ఖాన్ భవితవ్యం. ఈ రోజు పాక్ జాతీయ అసెంబ్లీలో జరిగిన పరిణామాలపై సుప్రీం కోర్ట్ విచారణ జరపనుంది. పాక్ జాతీయ అసెంబ్లీలో ఇమ్రాన్ ఖాన్ పై అవిశ్వాస తీర్మాణాన్ని స్పీకర్ తోసిపుచ్చడంతో ఇమ్రాన్ ఖాన్ కు ఊరట లభించింది. ఆ తరువాత జాతీయ అసెంబ్లీని రద్దు చేయాలని అధ్యక్షుడు ఆరీఫ్ అల్వీకి సిఫారసు చేయగా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

imrankhan

అయితే ఈ పరిణామాలపై ప్రతిపక్షాలు సుప్రీం కోర్ట్ ను ఆశ్రయించాయి. అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ జాతీయ అసెంబ్లీని రద్దు చేయడంపై పాకిస్థాన్ సుప్రీంకోర్టు సుమో-మోటో నోటీసు తీసుకుంది. ఈ కేసును విచారించేందుకు పాక్ సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి కూడా ఈ కేసును విచారించేందు సుప్రీం కోర్ట్ కు చేరుకున్నారు. ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ భవిష్యత్తు పాక్ సుప్రీం కోర్ట్ లో ఉంది. సుప్రీం కోర్ట్ ఏం తీర్పు ఇస్తుందో అని అంతా ఎదురుచూస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news