రెండు రోజుల కిందట పాక్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళం మెరుపుదాడులు జరిపి వందల మంది ఉగ్రవాదులను హతమార్చిన సంగతి తెలిసిందే. అయితే అందుకు ప్రతిగా భారత్‌లోని సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్ ఇవాళ ఉదయం దాడి చేసింది. పాక్‌కు చెందిన ఎఫ్-16 విమానం ఒకటి భారత భూభాగంలోకి చొచ్చుకు రాగా ఆ విమానాన్ని భారత సైనికులు కూల్చేశారు. అయితే ఈ ఘటనలో భారత్‌కు చెందిన మిగ్ 21 బైసన్ విమానం కూలిపోయింది. దీంతో అందులో ఉన్న కమాండర్ విక్రమ్ అభినందన్ పారాచూట్ సహాయంతో పాక్ భూభాగంలో దిగాడు. అయితే విక్రమ్‌ను కొందరు స్థానికులు పట్టుకుని చితకబాదారు. అంతలోనే పాక్ ఆర్మీ అధికారులు వచ్చి అభినందన్‌ను అదుపులోకి తీసుకున్నారు.
Indian airforce's Wing commander Abhinandan Varthaman was LUCKY that Pakistan army troops got to him in time. Few minutes delay on their part, and he would have been lynched by Angry Azad Kashmiri civilians. #PakistanStrikesBack #Kashmir pic.twitter.com/aWBn1fI4y8
— Habib. (@HabibInayatul11) February 27, 2019
కాగా అభినందన్ ను పాక్ దేశస్థులు చితకబాదుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో విడుదలైంది. అందులో అభినందన్ ను పాక్ దేశస్థులు, ఆర్మీ గాయ పరుస్తుండడాన్ని మనం చూడవచ్చు. కాగా ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే అభినందన్‌ను అదుపులోకి తీసుకున్న పాక్ ఆర్మీ అతని కళ్లకు గంతలు కట్టి తమ స్థావరానికి తీసుకెళ్లి ప్రశ్నించింది. అందులో అభినందన్‌ను మనం చూడవచ్చు. అతని ముఖంపై ఉన్న తీవ్ర గాయాలు కూడా మనకు కనిపిస్తున్నాయి.
మరో వైపు భారత్‌కు చెందిన మిగ్ 21 బైసన్ యుద్ధ విమానం కూలిపోయిందని, అందులో ఉన్న పైలట్ మిస్సయ్యాడని భారత విదేశాంగ ప్రతినిధి రవీష్ కుమార్ కొంత సేపటి క్రితమే నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు. అభినందన్ తమ అదుపులో ఉన్నాడని, పాక్ చెబుతుందని.. రవీష్ అన్నారు. కాగా భారత సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని పాక్ చేపట్టిన దాడిని సమర్థవంతంగా తిప్పికొట్టామని ఆయన తెలిపారు.