ప్రెగ్నెన్సీ వార్తలపై ఫైర్ అయిన రాయ్ లక్ష్మి

-

2005లో కాంచనమాల కేబుల్ టివి సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన రాయ్ లక్ష్మి అప్పటి నుండి అందివచ్చిన అవకాశాలను చేస్తూ కెరియర్ సాగిస్తుంది. ముని, కాంచ సినిమాల సీక్వెల్స్ తో బాగా పాపులర్ అయిన రాయ్ లక్ష్మి తమిళ, తెలుగు భాషల్లో స్పెషల్ సాంగ్స్ చేస్తూ వచ్చింది. బాలీవుడ్ లో కూడా జూలీ 2 అంటూ తన అందాలతో ఆకట్టుకోవలనీల్ని చూసినా పెద్దగా లాభం లేకుండాపోయింది.

ఇక ఈమధ్య మళ్లీ కెరియర్ ఊపందుకోగా ప్రస్తుతం తెలుగులో వేర్ ఈజ్ వెంకట లక్ష్మి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది రాయ్ లక్ష్మి. ఈ సినిమాలో కూడా అమ్మడు అందాలకు గట్టి పని చెప్పినట్టు తెలుస్తుంది. ఇక తనకు చాలా మందితో ఎఫైర్ ఉందని ఓపెన్ గా చెప్పేస్తున్న ఈ అమ్మడు ఈమధ్య తనకు ప్రెగ్నెన్సీ అని వచ్చిన వార్తలపై ఫైర్ అవుతుంది.

మీ వ్యూస్ కోసం తన గురించి ఇష్టం వచ్చినట్టు రాస్తే ఊరుకునేది లేదు. లీగల్ యాక్షన్ కు దిగుతా అంటుంది రాయ్ లక్ష్మి. తను ప్రస్తుతం ఎవరితో రిలేషన్ లో లేనని చెబుతున్న రాయ్ లక్ష్మి జీవితానికి తోడు కావాలి అందుకే తను ఎప్పుడు రిలేషన్ లో ఉంటానని చెబుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news