కోజికోడ్ విమాన ప్రమాద వలంటీర్లలో 26 మందికి కరోనా !

-

కొద్దిరోజుల క్రితం కేర‌ళ‌లోని కోజికోడ్ విమానాశ్ర‌యంలో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం కూలి ఇద్దరు పైలెట్లతో సహా 19 మంది ప్ర‌యాణికులు మరణించిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదం జరిగిన వెంటనే సహాయక చర్యల్లో అనేక మంది అధికారులతోపాటు స్థానికులు సైతం స్వచ్చందంగా పాల్గొన్నారు. ఈ క్రమంలో సహాయక చర్యల్లో పాల్గొన్న వారంతా క్వారంటైన్‌లోకి వెళ్లాలని ప్రభుత్వం సూచించింది. అప్పుడు పాల్గొన్న వారందరికీ కరోనా పరీక్షలు చేయగా వారిలో 22 మందికి క‌రోనా వైర‌స్ పాజిటివ్‌గా నిర్థారించారు.

వారిలో జిల్లా క‌లెక్ట‌ర్‌తో పాటు స్థానిక పోలీసు అధికారి కూడా ఉన్నారు. ఇక తాజాగా చేసిన పరీక్షల్లో లోకల్ వారికి 26 మందికి కరోనా సోకింది. ఇప్పుడు వారందరూ ప్రభుత్వ పర్యవేక్షణలో ఉన్న కోవిడ్ సెంటర్లలో ఉన్నారు. నిజానికి ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు, అగ్నిమాపక శకటాలు రావడానికి ముందే స్థానికులు అక్కడికి చేరుకున్నారు. కరోనా భయం ఉన్నా సరే వారిని రక్షించడానికి ఏమాత్రం వెనుకాడకుండా ముందుకు వెళ్లారు. అలా వెళ్ళిన వారిలో ఇప్పుడు 26 మంది కరోనా బారిన పడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news