బ్రేకింగ్ : మళ్ళీ సీఎం అభ్యర్దిగా పళనిస్వామి

-

తమిళ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. ఇప్పటిదాకా నేనే సిఎం అభ్యర్ధి అంటే నేనే సిఎం అభ్యర్ధి అని కొట్టుకున్న పళనిస్వామి, పన్నీర్ సెల్వంలు కలిసిపోయారు. ఈరోజు కొద్ది సేపటి క్రితం వీరిద్దరూ పార్టీ ఆఫీస్ కి చేరుకున్నారు. అనంతరం విలేఖరులని ఉద్దేశించి పన్నీర్ సెల్వం మాట్లాడుతూ 2021 ఎన్నికలకి గాను పళనిస్వామి సిఎం అభ్యర్ధి అని అయన ప్రకటించారు. మద్దతుదారులతో అలానే పార్టీ సీనియర్ నేతలతో పన్నీర్ సెల్వం, పళనిస్వామిలు కొద్ది రోజులుగా వరుస చర్చలు జరుపుతూ వస్తున్నారు.

ఇక సిఎం అభ్యర్ధిగా పళని స్వామిని పన్నీర్ సెల్వమే అనౌన్స్ చేయడంతో పార్టీలో ఏర్పడిన రాజకీయ సంక్షోభం ముగిసినట్టే. ఇక ప్రస్తుతం అన్నాడిఎంకే కార్యాలయంలో ఎన్నికలకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. 11 మందితో పార్టీ స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ కో ఆర్డినేటర్ గా పన్నీర్ సెల్వంని అనౌన్స్ చేశారు పళని స్వామి. పళని స్వామి, పన్నీర్ సెల్వంల మధ్య పోటీ ఉన్నా సిఎం అభ్యర్ధిని ప్రకటించి ఆయనే సన్మానం చేశారు. 18 మంది మంత్రులు పళని స్వామికి మద్దతు ఇవ్వడంతో ఇక తప్పక పన్నీర్ సెల్వం కూడా మద్దతు పలికినట్టు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news