కరోనా వ్యాక్సిన్ ఎప్పుడొస్తుందటే.. ఛీఫ్ మాటల్లో..

-

కరోనా కేసులు రోజు రోజుకీ పెరుగుతున్న వేళ వ్యాక్సిన్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పది సంస్థలు కరోనా వ్యాక్సిన్ పై ప్రయోగాలు చేస్తున్నాయి. ఇండియాలో భారత్ బయోటెక్, సీరం ఇన్స్టిట్యూట్ సంస్థలు వ్యాక్సిన్ ప్రయోగాలు చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ సంస్థలన్నీ మూడవ దశ క్లినికల్ ట్రయల్స్ లో ఉన్నాయి. మూడవ దశ క్లినికల్ ట్రయల్స్ విజయవంతంగా పూర్తయితే వ్యాక్సిన్ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంటుంది.

ఐతే కరోనా వ్యాక్సిన్ పై సామాజిక మాధ్యమాల్లో రకరకాల వార్తలు వస్తున్నాయి. అటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అక్టోబర్ లోనే వ్యాక్సిన్ వస్తుందని అన్నాడు. మరికొందరేమో వచ్చే ఏడాది మార్చి నాటికి వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుందని చెబుతున్నారు. ఐతే తాజాగా ప్రపంచ్వ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ అయిన టెడ్రాస్ అదనాన్, వ్యాక్సిన్ పై అప్డేట్ ఇచ్చాడు. ఈ ఏడాది చివర్లోగా వ్యాక్సిన్ వచ్చేస్తుందని అన్నాడు. ప్రస్తుతం వ్యాక్సిన్ ప్రయోగాలన్నీ చివరి దశకి వచ్చాయని, అందువల్ల ఈ ఏడాది చివర్లోగా వ్యాక్సిన్ వచ్చేస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ జరిపిన రెండు రోజుల మీటింగులో వెల్లడించాడు.

Read more RELATED
Recommended to you

Latest news