జగన్ హస్తిన వెళ్లింది ఎందుకో టీడీపీ నేతలకు చెప్పిన “ఈనాడు”!

-

నాలుకకు నరం ఉండకపోవచ్చు కానీ పెన్నుకు పాళి ఉంటుంది కదా! కొన్ని సార్లు అది లేకుండా రాసినా కూడా అది ప్లస్సే అవుతుంటుంది ప్రత్యర్ధులకు! ఇంతకూ ఈ లైన్ అంతా ఎందుకంటే… పదిరోజుల క్రితం కేంద్ర హోంమంత్రి అంతి షా తో జగన్ భెటీ అయినప్పుడు ఒకరకమైన ఊహాగాణాలు చేసి వైకాపాను ఇరుకునపెట్టాలను చూసిన పసుపు పత్రికలు.. తాజాగా ప్రధాని మోడీతో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భేటీ అవ్వడంపై టీడీపీని ఇరుకునపెట్టాయి!


అవును… వైఎస్ జగన్ ఎప్పుడు హస్తినకు వెళ్లిన మిగిలినవారి సంగతేమో కానీ… చంద్రబాబుకు – వారి అనుకూల మీడియాకు చెమటలు పట్టేస్తుంటాయి. అక్కడ జగన్ ను అమిత్ షా తిట్టారనో, కడిగేశారనో, జగన్ వివరణైచ్చే ప్రయత్నం చేసినా పట్టించుకోలేదనో… ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గురించి రాస్తున్నామన్న విజ్ఞత మరిచి రాస్తున్న సంగతులు తెలిసిందే! ఇక కొందరు టీడీపీ నేతలు అయితే… తన కేసుల విషయాల గురించి అమిత్ షా కాళ్లు పట్టుకోవడానికి జగన్ హస్తిన వెళ్లాడని ఆరోపించారు!

ఇదే క్రమంలో బండారు సత్యనారాయణ మూర్తి లాంటి టీడీపీ పెద్దమనుషులు అయితే… బెయిల్ పై ఉన్న వ్యక్తి కేంద్ర హోం మంతిని కలవడం ఏమిటి.. అందుకు అమిత్ షా ఒప్పుకోవడం ఏమిటి.. ఈ భేటీ కేసుల మాఫీకోసం కాక మరేమిటి అంటూ సాగదీశారు! అయితే తాజాగా అమిత్ షా తో భేటీ అయిన పదిరోజులకే మోడీతో భేటీ అయ్యే సరికి పసుపు బ్యాచ్ కు ముచ్చెమటలు పట్టాయి! పైగా “కేంద్ర బేబినెట్ లోకి వైకాపా” అనే కథనాలు వారిని మరింతగా టెన్షన్ పెట్టేసాయి!

అయితే… ఆ టెన్షన్ నుంచి వారిని రక్షించడానికో లేక తమ్ముళ్లకు ధైర్యం కలిగించడానికో తెలియదు కానీ… పసుపు పత్రికలు చాలా కష్టపడ్డాయి! ఈ సారి మోడీని జగన్ తిట్టారని కానీ, జగన్ తన కేసుల గురించి మోడీ కాళ్లు పట్టుకున్నారని కానీ, వ్యక్తిగత ప్రయోజనాలకోసమే హస్తిన యాత్ర అని కానీ మాట్లాడే అవకాశం టీడీపీ నేతలకు లేకుండా చేసింది “ఈనాడు”! “రాష్ట్ర స‌మ‌స్య‌ల గురించి మాత్ర‌మే మోడీ – జగన్ ల స‌మావేశం జ‌రిగింది” అని రాసుకొచ్చింది!

దీంతో జగన్ హస్తిన యాత్రపై టీడీపీ నేతలు తమ నోటికొచ్చిన విమర్శలు చేసే అవకాశం లేకుండా చేసింది వారి అనుకూల పత్రిక! దీంతో… చేసేది లేక.. జగన్ హస్తిన యాత్రపై వీలైనంత మౌనంగా ఉన్నారు టీడీపీ నేతలు.. ఆందోళనకు బీపీ టేబ్లెట్స్ ఉన్నాయి.. దుఃఖానికి లేవుగా!!

-CH Raja

Read more RELATED
Recommended to you

Latest news