పంచతంత్ర కథలు.. ఇక కంచరపాలెం సినిమా నేపథ్యంలోనే పంచతంత్ర కథలు సినిమా కూడా ఐదు కథలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి వినాయక చవితి సందర్భంగా ఆగస్టు 31వ తేదీన ప్రముఖ ఓటీటీ ఆప్ ఆహా వేదికగా ప్రసారం కానుంది. ఇకపోతే కంచరపాలెం సినిమాతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న అదే స్టోరీలు కాన్సెప్ట్ తో పంచతంత్ర కథలు రావడం చాలా ఆనందంగా ఉందని చెప్పవచ్చు. ఇక ఇందులో నోయల్ , నందిని రాయ్, సాయి రోనాక్ , ప్రణీత పట్నాయక్, గీతా భాస్కర్ , నిహాల్ కోదర్తి , అజయ్ కతుర్వర్ , సాదియ తదితరులు నటీనటులుగా నటిస్తున్నారు.
మధు క్రియేషన్స్ బ్యానర్ పై డి మధు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు శేఖర్ గంగనమోని దర్శకత్వం వహిస్తున్నారు.. ఇక ఈ సినిమా కథ సారాంశం విషయానికి వస్తే బాల్యంలో మనం పంచతంత్ర కథలు పుస్తకం చదువుకొని.. వాటి నుంచి ఎంతో కొంత నీతిని నేర్చుకున్నాం. ఇప్పుడు అలాంటి కథల ఇన్స్పిరేషన్తోని తెరకెక్కిన ఆంథాలజీ చిత్రం పంచతంత్ర కథలు. ఇకపోతే తాజాగా ఈ సినిమా నుంచి ప్రోమో విడుదల చేయగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇందులో మొత్తం ఐదు స్టోరీస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయని చెప్పవచ్చు.
మొత్తంగా ఐదు కథలుగా తెరకెక్కిన ఈ పంచతంత్ర కథలు సినిమా మంచి సందేశాన్ని ఇచ్చిందని చెప్పవచ్చు. ఇక దర్శకుడు ఎంచుకున్న కథలు వాటిని నడిపించడానికి రాసుకున్న స్క్రీన్ ప్లే అన్నీ కూడా ప్రేక్షకులను ఆద్యంతం ఆకట్టుకుంటాయి . ముఖ్యంగా మొదటి కథలో వచ్చే మోతేవారి పాటతో ప్రేక్షకుల్లో మంచి జోష్ నింపుతుంది. మిగిలిన పాటలు కూడా చాలా బాగున్నాయి. ఇక ఇలాంటి చిత్రాలను అప్పుడప్పుడు నిర్మిస్తూ ఉండడం వల్ల ప్రజలలో మంచి నీతిని కల్పించవచ్చు అని చెప్పవచ్చు. ముఖ్యంగా దర్శకుడు ఇలాంటి సందేశాత్మకమైన అంశాలు ఉన్న పంచతంత్ర కథలు ఎంచుకోవడం అభినందనీయం అని చెప్పాలి.