చింతామణి నాటకంపై కోర్టుకెక్కిన ఎంపీ రఘురామకృష్ణ

-

ఎన్నో దశాబ్దాలుగా తెలుగు వారిని అలరించిన చింతామణి నాటకాన్ని ఏపీ ప్రభుత్వం నిషేధించిన సంగతి తెలిసిందే. నాటకాన్ని ప్రభుత్వం నిషేధించడాన్ని వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు హైకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్ ను హైకోర్టు ఈరోజు విచారించింది. రఘురాజు తరపున న్యాయవాది ఉమేశ్ చంద్ర వాదనలను వినిపించారు. చింతామణి నాటకాన్ని నిషేధించాలని రాష్ట్రంలో ఎవరూ కోరలేదని… ఒక సామాజికవర్గాన్ని కించపరిచే పదాలను మాత్రమే తొలగించాలని కోరారని కోర్టుకు తెలిపారు. అయితే ఆ సామాజికవర్గాన్ని సంతృప్తి పరిచేందుకే నాటకంపై ప్రభుత్వం నిషేధం విధించిందని చెప్పారు.

Lok Sabha panel to take up YSRCP plea to disqualify rebel MP Raghu Rama  Krishna Raju | The News Minute

వాదనలు విన్న న్యాయస్థానం నాటకం అసలు ప్రతిని అందించాలని కోరింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. అయితే గతంలో..హైకోర్టును ఆశ్రయించిన రఘురామ అంశాలను పరిశీలిస్తే.. ‘చింతామణి నాటకాన్ని నిషేధిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల వేలాది మంది కళాకారులు జీవనోపాధి కోల్పోతున్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాసే విధంగా ప్రభుత్వ నిర్ణయం ఉంది. ఈక్రమంలో ప్రభుత్వం చింతామణి నాటకాన్ని నిషేధిస్తూ జారీ చేసిన జీవో 7ను రద్దు చేయాలి. తద్వారా ప్రభుత్వ చర్యలను నివారించాలి’ అని కోరారు.

 

Read more RELATED
Recommended to you

Latest news