బ్రహ్మనందం ‘పంచతంత్ర’ ట్రైలర్‌.. ఆద్యంతం ఆసక్తికరంగా..

-

ఈ మధ్య కాలంలో చిన్న సినిమాల జోరు మరింత పెరిగింది. ఎలాంటి అంచనాలు లేకుండా వస్తున్న ఈ తరహా సినిమాలు, కంటెంట్ ఉంటే చాలు ఆడియన్స్ కి కనెక్ట్ అవుతున్నాయి. చిన్న సినిమాగా వచ్చి, బాక్సాఫీస్ దగ్గర పెద్ద సినిమాలను ఆశ్చర్యపరుస్తున్నాయి. అలా థియేటర్స్ కి రానున్న మరో చిన్న సినిమానే ‘పంచతంత్రం’. బ్రహ్మానందం, స్వాతి రెడ్డి, స‌ముద్ర ఖ‌ని, రాహుల్ విజ‌య్‌, శివాత్మిక రాజ‌శేఖ‌ర్‌, న‌రేష్ అగ‌స్త్య‌, దివ్య ద్రిష్టి, వికాస్ ముప్ప‌ల త‌దిత‌రులు న‌టిస్తోన్న చిత్రం ‘పంచతంత్రం’. టికెట్ ఫ్యాక్టరీ, ఒరిజిన‌ల్స్ ప‌తాకాల‌పై అఖిలేష్ వ‌ర్ధన్‌, సృజ‌న్ ఎర‌బోలు నిర్మిస్తోన్న ఈ చిత్రానికి హ‌ర్ష పులిపాక ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్నారు. డిసెంబ‌ర్ 9న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కానుంది.

Panchathantram trailer: A breezy, warm anthology about standing up for your  loved ones

నేడు ఈ సినిమా ట్రైల‌ర్‌ను స్టార్ హీరోయిన్ ర‌ష్మిక మంద‌న్న విడుద‌ల చేసిన చిత్ర యూనిట్‌కి అభినంద‌న‌లు తెలియ‌జేశారు. ‘పంచతంత్రం’… 5 జంట‌ల‌కు సంబంధించిన క‌థ అని ట్రైలర్ చూస్తే అర్థ‌మ‌వుతుంది. బ్ర‌హ్మానందం ఈ ఐదు క‌థ‌ల‌కు ‘పంచేద్రియాలు’ అనే పేరు పెట్టి, ఆ సీన్ తో ప్రేక్షకులను సినిమాలోకి తీసుకెళతారు. జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఉంటాయి… సంతోషాలే కాదు… బాధ‌లు కూడా వ‌స్తుంటాయి. అలా వ‌చ్చిన‌ప్పుడు మ‌నం వాటిని ఎలా స్వీక‌రించాం… మ‌న ప‌నుల‌ను ఎంత బాధ్య‌త‌గా పూర్తి చేస్తూ ఎలా ముందుకెళ్లామ‌నేది ‘పంచతంత్రం’ క‌థాంశం అని క్లియ‌ర్‌గా తెలుస్తుంది. సినిమాలో మ‌న‌కు క‌నిపించ‌బోయే ఐదు జంట‌ల‌కు ఒక్కో క‌థ .. ఒక్కో ర‌క‌మైన ప్ర‌యాణం.. అవ‌న్నీ ఎలాంటి ముగింపుతో ఎండ్ అయ్యాయ‌నే ‘పంచతంత్రం’ సినిమా ఫీల్ గుడ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా హార్ట్ ట‌చింగ్ ఎమోష‌న్స్‌తో ముందుకు సాగుతుంది.

ప్ర‌తి క‌థ‌లో మ‌న చుట్టూ ఉన్న స‌మాజాన్ని అందులో వ్య‌క్తుల వ్య‌క్తిత్వాల‌ను ద‌ర్శ‌కుడు హ‌ర్ష ఎంతో అర్థ‌వంతంగా ముందుకు
తీసుకెళ్లిన్న‌ట్లు తెలుస్తోంది. ఇలాంటి ఫీల్ గుడ్ యాంథాల‌జీని ద‌ర్శ‌కుడు ఎలా ట్రీట్ చేశార‌నే ఎగ్జ‌యిట్‌మెంట్ కూడా క‌లుగుతుంది. అర్థ‌వంత‌మైన సంభాష‌ణ‌లు ప్ర‌తి పాత్ర‌లోని భావోద్వేగాల‌ను సెన్సిబుల్‌గా ఎలివేట్ చేస్తున్నాయి. స‌న్నివేశాల‌ను, వాటిలోని ఎమోష‌న్స్‌ను ప్ర‌శాంత్ ఆర్‌.విహారి సంగీతం, రాజ్ కె.న‌ల్లి సినిమాటోగ్ర‌ఫీ నెక్ట్స్ లెవ‌ల్‌కు తీసుకెళ్లాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news