భారత్, ఇంగ్లండ్‌ల మధ్య చెన్నైలో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ సందర్బంగా భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ అద్భుతమైన క్యాచ్ పట్టాడు. తొలి ఇన్నింగ్స్ లో పంత్ రెచ్చిపోయి ఆడాడు. 58 పరుగులతో అజేయంగా నిలిచాడు. అలాగే వికెట్ల వెనుక కూడా అద్భుతమైన ప్రదర్శన చేశాడు.
మహమ్మద్ సిరాజ్ వేసిన ఓ బంతిని ఆడిన ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్ ఆల్లీ పోప్ ఆ బంతికి ఎడ్జ్ ఇచ్చాడు. దీంతో బంతి వెనుకకు క్యాచ్ వెళ్లింది. అయితే పంత్ గాల్లోకి దూకి మరీ బంతిని ఒడిసిపట్టాడు. నిజానికి ఆ క్యాచ్ అంత సులభంగా లభించేది కాదు. కానీ పంత్ గాల్లోకి అద్భుతంగా డైవ్ చేసి క్యాచ్ పట్టాడు. దీంతో సిరాజ్‌కు వికెట్ లభించింది.
Spiderman Pant #INDvsENG pic.twitter.com/0F1G8l9gjM
— div (@div_yumm) February 14, 2021
కాగా సిరాజ్ ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లలో టెస్టుల్లోకి ప్రవేశించాడు. కానీ ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో ఆడలేదు. జస్‌ప్రిత్ బుమ్రాకు సెలెక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. దీంతో అతని స్థానంలో సిరాజ్ వచ్చాడు. ఈ క్రమంలోనే భారత గడ్డపై తొలి టెస్టు మ్యాచ్ ఆడిన సిరాజ్ మొదటి మ్యాచ్‌లోనే అద్భుతమైన ప్రదర్శన చేశాడు. ఇక భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 329 పరుగులకు ఆలౌట్ అవగా రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 1 వికెట్ నష్టానికి 54 పరుగులు చేసింది. ఇంగ్లండ్‌పై భారత్ 249 పరుగుల ఆధిక్యంలో ఉంది.