కొంపలో కుంపటి: పుష్పా శ్రీవాణి మామకు మరో ఆప్షన్ లేదా?

-

ఏపీ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణిపై ఆమె మామ శత్రుచర్ల చంద్రశేఖర రాజు సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల ఆయన మీడియా ముందుకొచ్చి.. పుష్పశ్రీవాణి సొంత నియోజకవర్గమైన కురుపాంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదంటూ ఆరోపించారు. రోడ్ల సదుపాయం, తాగునీటి కల్పన, అర్హులైన వారికి పెన్షన్లు కల్పించడంలో స్థానిక నాయకులు విఫలమయ్యారంటూ తన కోడలు డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణిని ఉద్దేశించి సంచలన కామెంట్స్ చేశారు. దీనిపై నియోజకవర్గం వారీగా తీవ్ర చర్చలు జరుగుతున్నాయి.

నిజంగా నియోజకవర్గంలో సమస్యలు ఆ స్థాయిలో ఉంటే… చంద్రశేఖర్ చర్చించడానికి, సమస్యలు చెప్పడానికి వేదిక “ఆ ఛానల్” కాదనేది కొందరి వాదనగా ఉంది. సొంత కోడలు ఎమ్మెల్యేగా, డిప్యుటీ సీఎం గా ఉన్నప్పుడు ఈయన మైకుల ముందుకొచ్చి ఆ స్థాయిలో స్పందించాల్సిన అవసరం లేదు… ఆమెతో వ్యక్తిగతంగా ఆ విషయాలపై చర్చించొచ్చు.. లేదా ఆమెతో ఆయనకు ఏమైనా కుటుంబ కలహాలు ఉన్న నేపథ్యంలో తన కుమారుడితో అయినా మాట్లాడుకోవచ్చు. అలా కాకుండా నేరుగా మైకుల ముందుకు రావడంలో ఆయన ఉద్దేశ్యం ఏమై ఉంటాది అన్న యాంగిల్ లో పలువురు ఆలోచిస్తున్నారు.

ఆమెను రాజకీయాంగా బ్యాడ్ చేయాలనేదే మామ ఉద్దేశ్యమా లేక ఆమెను ఇబ్బంది పెట్టడం వల్ల ఆయనకు కలిగే ప్రయోజనం మరోరకమా అన్నదిశగా చర్చలు నడుస్తున్నాయి. ఈ విషయంలో రాజకీయ ప్రత్యర్ధుల పాత్ర, వారితో చంద్రశేఖర్ చర్చలు జరిపారా అన్న యాంగిల్ లో కూడా స్థానిక జనం.. విశ్లేషకుల మాదిరి డిస్కషన్స్ చేసుకోవడం కొసపెరుపు. నిజంగా చంద్రశేఖర్ రాజు వైకాపా నాయకుడే కనుక.. ఆయన బాధ్యతను కూడా ఈ సందర్భంగా పలువురు గుర్తు చేస్తున్నారు. నియోజకవర్గంలో అలాంటి సమస్యలు ఉంటే… అదిష్టాణం దృష్టికి తీసుకువెళ్లాలి, లేదా అధికారులతో మాట్లాడాలి. అంతే కాని.. ఇలా పార్టీ పరువు పోయేలా వ్యాఖ్యానించడం ఏమిటని వైకాపా కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు.

ఇటు కోడలు పరువు, అటు పార్టీ పరువు కాపాడాల్సిన ఆయన… ఇలా ప్రలోభాలకు లొంగిన వ్యక్తిగా మాట్లాడటం సరికాదని నియోజకవర్గంలోని స్థానిక నేతలు అభిప్రాయపడుతున్నారు. “పుష్ప శ్రీ వాణి మామ” – “డిప్యూటీ సీఎం మామ” అనేది ఆయన ఐడెంటిటీ కాబట్టే మీడీయాలో ఆ స్థాయి కవరేజ్ దొరికిందని.. ఆ విషయం ఆయన మరిచిపోకూడదని.. కోడలు కష్టపడి, పార్టీలో నమ్మకంగా పనిచేసి ఆ స్థాయికి చేరినప్పుడు.. ఇలా కొంపలోనే కుంపట్లు పెట్టడం సమంజసం కాదని మరికొందరు వాపోతున్నారు.

తాజా ఈ వ్యవహారంపై శత్రుచర్ల కుమారుడు, పుష్పా శ్రీవాణి భర్త పరీక్షిత్ రాజు రియాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా తండ్రి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన ఆయన… “ప్రతిపక్షం కూడా ప్రశ్నించలేని వాతావరణంలో సొంత వాళ్లే ఇలా వేలి ఎత్తి చూపటం సమంజసం కాదు. మేం అభివృద్ధిని మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపిస్తున్నాం. వైసీపీ వారికే పెన్షన్లు ఇస్తున్నామని నా తండ్రి ఆరోపించినట్టు మేం వ్యవహరించటం లేదు” అని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news