తెలుగుదేశం పార్టీ లో ప్రముఖ కుటుంబం రాయలసీమ ప్రాంతానికి చెందిన కుటుంబం పరిటాల కుటుంబం తెలుగుదేశం పార్టీకి ఆవిర్భవించిన నాటి నుండి మొదటి నుండి అండగా ఉంటున్న విషయం అందరికీ తెలిసినదే. పరిటాల రవి చనిపోయిన తర్వాత ఆయన భార్య పరిటాల సునీత తెలుగుదేశం పార్టీలో కీలకంగా రాణిస్తూ అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం నుండి పోటీ చేసి 2014 ఎన్నికల్లో గెలిచి అదే సమయములో మంత్రిగా కూడా వ్యవహరించడం జరిగింది.
తర్వాత పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరామ్ రాజకీయాల్లో అడుగుపెట్టి 2019 ఎన్నికల్లో మొట్టమొదటిసారి పోటీ చేసి ఓడిపోయాడు. అయితే ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు ప్రభుత్వం పై అనేక విమర్శలు మరియు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో అమరావతి ప్రాంతంలో నిరసనలు చేస్తున్నా గాని పరిటాల కుటుంబం నిరసనల్లో పాల్గొనకపోవడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో టీడీపీలో పెద్ద హాట్ టాపిక్ అయింది.
దీంతో పరిటాల కుటుంబం తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నట్లు త్వరలోనే బిజెపి పార్టీలో జంప్ అవటానికి సిద్ధమవుతున్నట్లు అనంతపురం జిల్లా రాజకీయాల్లో వార్తలు వినబడుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే పరిటాల సునీత మరియు శ్రీరామ్ ఇద్దరూ కలిసి బీజేపీతో టచ్లో ఉన్నట్లు ఆ పార్టీలో చేరడానికి షరతులు నిబంధనలు బిజెపి పార్టీ పెద్దలు పెట్టడంతో ఆలోచనలో తల్లీ కొడుకులు పడినట్లు త్వరలోనే ఓ నిర్ణయానికి రానున్నట్లు అనంతపురం జిల్లా రాజకీయాల్లో వినబడుతున్న టాక్.