ప్రస్తుతం నడుస్తున్న శీతకాల పార్లమెంటు సమావేశాలు నేటితో ముగియనున్నాయి. షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 23 వరకు నిర్వహించాల్సిది. కానీ ఈ సమావేశాలకు సంబంధించి ప్రభుత్వ అజెండా పూర్తి కావడం తో నేడు పార్లమెంటు ఉభయ సభలను నివరవధిక వాయిదా వేయనున్నారు. కాగ ప్రస్తుతం జరుగుతున్న శీతకాలం పార్లమెంటు సమావేశాలు నవంబర్ 29 నుంచి ప్రారంభం అయ్యాయి. షెడ్యూల్ ఒక రోజు ముందుగానే సమావేశాలు ముగియనున్నాయి.
ఈ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం పలు కీలక బిల్లు లను తీసుకువచ్చింది. మూడు సాగు చట్టాలను రద్దు చేయడం నుంచి అమ్మాయిల వివాహా వయస్సు కు సంబంధించిన బిల్లు వరకు అనేక బిల్లును పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. కానీ అమ్మాయిల వివాహా వయస్సు కు సంబంధిన బిల్లు మాత్రం ఆమోదించ లేదు. ఈ బిల్లును సెలక్టె కమిటీ కి కేంద్ర ప్రభుత్వం పంపించింది. అలాగే ఈ సమావేశాల్లో ప్రతి పక్ష పార్టీలకు చెందిన 12 మంది ఎంపీలను సస్పెన్షన్ చేయడం పెద్ద దూమారం లేపింది. ఈ అంశం పనే పార్లమెంటు లో ఎక్కువ సమయం వృథా అయింది.