దక్షిణాఫ్రికా దేశం లో ఒమిక్రాన్ వేరియంట్ పురుడు పోసుకున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ వేరియంట్ ఇప్పుడు 90 దేశాలకు పాకేసింది. దీంతో ప్రపంచ దేశాలు అతలాకుతలం అవుతున్నాయి. ఇక మన ఇండియాలోనూ.. ఈ కొత్త వేరియంట్.. విజృంభిస్తుంది. ఇప్పటికే మన దేశం లో 213 ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి. ఇలాంటి తరుణంలో… ఆనందయ్య సంచలన ప్రకటన చేశారు.
ఒమిక్రాన్ వేరియంట్ కోసం తాను మందును ఇప్పటికే తయారు చేశానని ప్రకటించారు ఆనందయ్య. ఒమిక్రాన్ వేరియంట్ సోకిన వారు తనను సంప్రదించాలని కోరారు. తనను సంప్రదిస్తే… ఒమిక్రాన్ వేరియంట్ ను 48 గంటల్లోనే.. ఖతం చేస్తానని ప్రకటించారు ఆనందయ్య. ఒమిక్రాన్ సోకిన బాధితుల కుటుంబ సభ్యులు వచ్చినా.. తాను మందు ఇచ్చేందుకు రెడీ గా ఉన్నట్లు స్పష్టం చేశారు. కాగా.. గతంలోనూ కరోనా వైరస్ కు ఆనందయ్య మందు తయారు చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పటి కూడా.. ఆనందయ్య కరోనా బాధితులకు మందును సరఫరా చేస్తూనే ఉన్నారు.