మౌలాలి: ఓ వ్యక్తి రైలు కింద పడి మృతి చెందిన ఘటన మౌలాలి జిఆర్పి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మౌలాలి రైల్వే స్టేషన్ సమీపంలో 30 నుంచి 35 సంవత్సరాల వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.