రేపటి నుంచే పార్లమెంట్ సమావేశాలు

-

రేపటి నుంచే పార్లమెంట్ సమావేశాలు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ పార్లమెంట్ భవనం లో ఉదయం 11 గంటలకు అఖిలపక్ష సమావేశం ప్రారంభం అయింది. పార్లమెంటరీ వ్యవహరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆధ్వర్యంలో నేడు 11 గంటలకు అఖిలపక్ష సమావేశం అయింది. ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోడీ కూడా హాజరు అయ్యారు.

పార్లమెంట్
పార్లమెంట్

అలాగే ఈ సమావేశానికి ఉభయ సభలకు చెందిన అన్ని పార్టీల ప్రతి పక్షాల నాయకులు హాజరు అయ్యారు. ప్రస్తుతం ఆ అఖిల పక్ష సమావేశం ఇంకా కొనసాగుతోంది. వర్షాకాల సమావేశాలలో చర్చకు తీసుకురావాల్సిన అంశాలపై అన్ని పక్షాల నాయకులు పలు సూచనలు చేస్తున్నట్లు సమాచారం.అటు అర్థవంతంగా, సజావుగా పార్లమెంట్ సమావేశాలు సాగేందుకు అన్ని ప్రతి పక్షాల సహకారం కోరనుంది ప్రభుత్వం. ఈ పార్లమెంట్ వర్షాకాల సమావేశాలలో ఏకంగా 15 బిల్లులను ప్రవేశ పెట్టనుంది. ఈ బిల్లులకు అన్నీ పార్టీల ఆమోదం కావాలని ప్రధాని మోడి కూడా ప్రతి పక్షాలను కోరనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news