కాంగ్రెస్‌లో నాయకులకు పని విభజన మొదలైంది. పేరుకే పార్టీకి ముగ్గురు వర్కింగ్ ప్రెసిడెంట్స్… ఎవరు ఏం చేస్తారో… ఏం చేయాలో క్లారిటీ ఉండేది కాదు. కానీ ఇంఛార్జి ఠాగూర్ పార్టీ ముగ్గురు వర్కింగ్ ప్రెసిడెంట్స్ కి పని విభజన చేశారు.కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్స్‌కు పార్లమెంట్ నియోజకవర్గ వారీగా బాధ్యతల్ని అప్పగించింది పార్టీ హైకమాండ్. పార్టీ యాక్టివిటీ అంతా ఇక వారిదేనని చెప్పారు ఠాగూర్.
రేవంత్ రెడ్డికి ఆదిలాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, నిజామాబాద్, జహీరాబాద్, మహబూబా బాద్ పార్లమెంట్ నియోజకవర్గాల బాధ్యత అప్పగించారు. పొన్నం ప్రభాకర్ కి మెదక్, మల్కాజిగిరి, సికింద్రాబాద్, హైదరాబాద్, చేవెళ్ల , ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. అలాగే కుసుమ కుమార్‌కి మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ , నల్గొండ, భువనగిరి,వరంగల్ ఇచ్చారు. ఇటు పార్టీకి అంటి ముట్టనట్టు ఉండే అజారుద్దీన్ కి అనుబంధ సంఘాల బాధ్యత అప్పగించారు ఠాగూర్.
ఇక జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ మేనిఫెస్టో రూపొందించేందుకు పీసీసీ కమిటీ వేసింది. కమిటీ చైర్మన్ గా మర్రి శశిధర్ రెడ్డి కన్వీనర్‌గా దాసోజు శ్రవణ్‌ను ప్రకటించారు. వీరితో పాటు 8 మంది సభ్యులు ఉన్నారు. అటు పార్టీ యాక్టివిటీతో పాటు ఇటు గ్రేటర్ ఎన్నికలకు సిద్ధమవుతున్న కాంగ్రెస్ అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకుంటోంది.