పవన్ చేతిపై పచ్చబొట్టు..ఏంటి పవన్ ఈ గుట్టు…!!!

-

పవన్ కళ్యాణ్ గత కొంతకాలంగా సినిమాలకి దూరంగా ఉంటూ రాజకీయలపై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టడంతో అభిమానులు పవన్ నుంచీ ఎప్పుడు సినిమా వస్తుందో అంటూ కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూశారు. కానీ ఎట్టకేలకి పవన్ కళ్యాణ్ ఏపీ పాలిటిక్స్ లో కీలక పాత్ర పోషిస్తూనే ఆర్దిక అవసరాలకి గాను, భవిష్యత్తులో పార్టీని బలోపేతం చేయడానికి అవసరమైన వనరులని సమకూర్చుకోవడానికి మళ్ళీ సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు సినిమాలకి పవన్ ఒకే చెప్పడంతో ఒక్క సారిగా అభిమానులు సంబరాలు చేసుకున్నారు..ఇదిలాఉంటే

పవన్ రెండు రోజుల క్రితం కొత్త గెటప్ లో కనిపించి అందరిని ఆశ్చర్య పరిచారు. గెడ్డంతో నిండిపోయిన ముఖాన్ని క్లీన్ షేవ్ చేయించి, గుబురు మీసంతో జుట్టు ఒత్తుగా పెంచుకుని కర్నూల్ లో కార్యకర్తల సమావేశంలో పాల్గొనడంతో అందరూ ఆశ్చర్యపోయారు. అయితే పింక్ రీమేక్ సినిమాలో భాగంగానే పవన్ ఈ గెటప్ లో వచ్చారని తెలుస్తోంది. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ మరో సారి అందరిని ఆలోచనలో పడేశారు అదేంటంటే..

 

పవన్ చేతిపై ఉన్న పచ్చ బొట్టు..ఇప్పుడు ఇదే పెద్ద వింత అయ్యింది. పవన్ కళ్యాణ్ సహజంగా ఇలాంటి విషయాలకి దూరంగా ఉంటారు. ఇప్పటి వరకూ పవన్ కళ్యాణ్ పచ్చ బొట్టు వేసుకోలేదు కానీ త్రిశూలం, డమరుకం తో కలిసి ఉన్న ఓ బొమ్మని పచ్చబొట్టుగా చేతిమీద వేసుకోవడంతో ఇది సినిమాలో భాగంగా వేసుకున్నారా లేక కావాలనే పవన్ తన పర్సనల్ ఇంట్రస్ట్ తో వేసుకున్నారా అనేది మాత్రం తేలలేదు. అయితే క్రిష్ తో చేయబోతున్న సినిమాలో భాగంగానే పవన్ ఈ పచ్చ బొట్టు వేసుకున్నారని అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. మరి ఈ పచ్చబొట్టు వెనకాల గుట్టు ఎప్పుడు రట్టవుతుందో..

Read more RELATED
Recommended to you

Latest news