తెలంగాణ రాబిన్ హుడ్ ‘పండగల సాయన్న’ గా పవన్….??

-

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రస్తుతం బాలీవుడ్ కోర్ట్ డ్రామా మూవీ పింక్, తెలుగు రీమేక్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఓ మై ఫ్రెండ్, ఎంసీఏ సినిమాల దర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పవన్ ఒక లాయర్ పాత్రలో నటిస్తుండగా దిల్ రాజు, బోనీ కపూర్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇక దీనితో పాటే క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో పవన్ ఒక సినిమాలో నటించనున్నారు. పాన్ ఇండియా ఫీల్ తో పీరియాడికల్ డ్రామా స్టోరీ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్,

తెలంగాణ రాబిన్ హుడ్ గా పేరు గాంచిన పండగల సాయన్న పాత్రలో నటిస్తున్నట్లు టాక్. ఇక ఈ లుక్ కోసమే పవన్ తన గడ్డం ట్రిమ్ చేసినట్లు చెప్తున్నారు. అంతేకాక ఈ లుక్ తాలూకు ప్రీ లుక్ ఫోటో ఒకటి ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆ ఫోటోలో సాయన్న పాత్రదారి తలపై ఎర్రనిపాగా ధరించి, ముంజేతికి కంకణం, బొడ్లో వీరఖడ్గం, బుల్లెట్ల జడను ఒంటికి చుట్టుకుని, రింగుల జుట్టు, కోర మీసాలతో ఉన్న ఆ ఫోటోని చూసిన పలువురు పవన్ ఫ్యాన్స్, సినిమాలో పవన్ లుక్ ఇలానే ఉండబోతుండడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఎంతో భారీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే తాజ్ మహల్, చార్మినార్ వంటి కట్టడాల సెట్స్ ని హైదరాబాద్ శివార్లలో వేసినట్లు తెలుస్తోంది. శ్రీ సూర్య మూవీస్ బ్యానర్ పై ఏ ఎమ్ రత్నం నిర్మాతగా తెరకెక్కనున్న ఈ సినిమాకు ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. అయితే సినిమాలో నటించే హీరోయిన్, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు మాత్రం తెలియాల్సి ఉంది…..!!

Read more RELATED
Recommended to you

Latest news