నా భర్త బంగారం.. నరేష్‌ తో పెళ్లిపై ట్విస్ట్ ఇచ్చిన పవిత్ర !

-

గత నాలుగు రోజులుగా నరేష్‌ నాలుగో పెళ్లి చేసుకుంటున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. పవిత్రా లోకేష్‌ ను నరేష్‌ పెళ్లి చేసుకుంటున్నారని వార్తలు వచ్చాయి. అయితే.. ఈ వార్తలను నరేష్‌ తాజాగా కొట్టి పారేయగా.. తాజాగా పవిత్ర లోకేష్‌ తన భర్తపై చేసిన వ్యాఖ్యలు వైరల్‌ గా మారాయి. తన భర్త బంగారం అంటూ ఆమె వ్యాఖ్యానించింది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పవిత్ర మాట్లాడుతూ… “నా భర్త నేనున కలిసి ఓ సీరియల్‌ నటించాం. అది స్నేహమో, ప్రేమో, గౌరవమో తెలీదు గానీ.. ఒకరిపై ఒకరికి ఉన్న అభిమానంతో పెళ్లి చేసుకున్నాం. ఆయన చాలా గొప్ప వ్యక్తి. నాతో కంపేర్‌ చేసుకుంటే.. ఆయన చాలా బెటర్‌ పర్సన్‌. అలాంటి వ్యక్తిని ఎక్కడా చూడలేదు. ఆయనలో ఒక్క లోపాన్ని కూడా కనిపెట్టలేం. ఆయన నాతో ఎంతో గౌరవంతో మెలుగుతారు ” అంటూ పవిత్ర చెప్పుకొచ్చింది. రెండో పెళ్లి చేసుకుంటారన్న నేపథ్యంలోనే పవిత్ర లోకేష్‌ వ్యాఖ్యలు వైరల్‌ కావడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news