మన దేశంలో కరోనా ఫోర్త్ వేవ్ విలయతాండవం చేస్తోంది. మొన్నటి వరకు భారీగా తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు..మళ్ళీ పుంజుకున్నాయి. అయితే తాజాగా నిన్నటి కంటే ఎక్కువగానే ఇవ్వాళ కరోనా కేసులు నమోదు అయ్యాయి. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 17336 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,33,62,294 కు చేరింది.
ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 88,284 కు చేరింది. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 99.22 శాతంగా ఉంది. ఇక దేశంలో తాజాగా 13 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 5,24,954 కి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 13029 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 4,27,36,027 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,96,77,33,217 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక గడిచిన 24 గంటల్లో 13,71,107 మందికి కరోనా వ్యాక్సిన్లు వేసింది ఆరోగ్య శాఖ.
India reports 17,336 new Covid19 cases today; Active cases rise to 88,284 pic.twitter.com/TDqDUCnqoq
— ANI (@ANI) June 24, 2022