సీఎంపై పవన్ పొగడ్తలు.. అందరికీ ఆదర్శం అంటూ ట్వీట్..

తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ సంచలన నిర్ణయాలతో… ప్రతి పక్షాల నేతలతో కూడా శభాష్‌ అనిపించుకుంటున్నారు. రాష్ట్ర అభివృద్ధికి అన్ని తానై కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత.. కరోనాను ఎదుర్కొవడంలో ప్రతి పక్షాల సలహాలు తీసుకోవడం… ఆర్థిమ మండిలో ఆర్బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్ రాజన్‌ లాంటి నియమించడం లాంటి ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు స్టాలిన్‌.

pawankalyan
pawankalyan

అయితే తాజాగా స్టాలిన్‌ పాలనపై జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ప్రశంసలు కురిపించారు. సీఎం గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన వ్యవహరిస్తున్న తీరును పవన్‌ అభినందించారు. ఏ పార్టీ అయినా ప్రభుత్వంలోకి రావడానికి రాజకీయం చేయాలి.. కానీ అధికారంలోకి వచ్చాక ఆ పని చేయకూడదు. దీన్ని మీరు మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపిస్తున్నారు. మీ పరిపాలన, ప్రభుత్వ పనితీరు మీ ఒక్క రాష్ట్రానికే కాకుండా దేశంలోని రాష్ట్రాలకు, అన్ని పార్టీలకు మార్గదర్శకం.. స్ఫూర్తిదాయకం. మీకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను అంటూ పవన్ కల్యాన్‌ ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం పవన్‌ చేసిన ఈ ట్వీట్‌… సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.