హరీశ్ శంకర్ మూవీలో డాన్ గెటప్ లో పవర్ స్టార్…!

డాన్ అనగానే బాలీవుడ్ సినిమాలే మనకు గుర్తుకువస్తాయి.ఆతర్వాత ఆ ప్లేస్ కశ్చితంగా కోలీవుడ్ కు పోతుంది.ఇంతకాలం ఇద్దరు ముగ్గురు హీరోలు అక్కడ ఇలాంటి సినిమాలే చేసి… టూ మచ్ హీరోయిజాన్ని తంబీలకు చూపించారు.కాని మన తెలుగుకు వచ్చేసరికి… హీరో డాన్ అంటే నవ్వి ఊరుకుంటారు.అందుకనే మనవాళ్లెవరు డాన్ వేషాల జోలికి అంతగా పోలేదు.ఐతే ఈ డాన్ గెటప్ ను ఈసారి పవన్ వేస్తుడానే టాక్ ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది.

పవర్ స్టార్ ప్రీవియస్ ఫిలింస్ లో హీరోయిజం పీక్స్ లో ఉంటుంది. చేసే ప్రతి సినిమాలో ఏదో ఒక మెసేజ్ ప్రేక్షకులకు ఇవ్వాలని చూస్తున్నాడు.త్వరలో హరీష్ శంకర్ తో చేసే సినిమాలోను మనోడు అలాంటి యాక్షన్ ప్యాక్ నే ట్రై చేస్తున్నాడు. ఐతే ఈసారి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో డాన్ గెటప్ తో ఫ్యాన్స్ ను మరింతగా సర్ఫరైజ్ చేయాలని చూస్తున్నాడు. పవర్ స్టార్ ఎన్ని యాక్షన్ ప్యాక్స్ చేసినా… తాను డాన్ పాత్ర పోషించింది లేదు. పవర్ ఫుల్ కాప్ గా మాత్రమే కనిపించాడు.అదీ లేదంటే సొసైటీ భాద్యతలు తీసుకున్న కుర్రాడిగా అలరించాడు. పంజా సినిమాలో డాన్ కు అణుచరుడిగా మాత్రమే నటించాడు తప్ప ఎండ్ ఆఫ్ ది ఫ్రేమ్ డాన్ గా అయ్యింది లేదు. జస్ట్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ వరకే ఈ డాన్ అని తెలియడంతో దానికి ఓకే చెప్పినట్లు తెలుస్తుంది.