జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వైసీపీ నాయకులపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఇవాళ మంగళ గిరిలో నిర్వహించిన సమావేశంలో ముఖ్యంగా వైసీపీ కాపు ఎమ్మెల్యేలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను మూడు పెళ్లిళ్లు చేసుకున్నానని తరచూ వ్యాఖ్యలు చేసే వారిపై మండిపడ్డారు. తాను విడాకులు ఇచ్చిన తర్వాతే మూడు పెళ్లిళ్లు చేసుకున్నానని.. కొందరిలాగా.. ఒకరిని పెళ్లి చేసుకుని 30 మంది స్టెపినీలతో తిరిగే రకం కాదని అన్నారు.
కులాల పేరుతో కొందరు వైసీపీ నాయకులు ఏపీలో చిచ్చులు పెడుతున్నారని పవన్ కల్యాణ్ ఆరోపించారు. సభ్యత, సంస్కారం ఉన్న వాళ్లం కాబట్టి ఇన్నాళ్లూ తాము మౌనంగా ఉన్నామని అన్నారు. కానీ ఇవాళ్టి నుంచి వైసీపీపై యుద్ధానికి సై అని తేల్చి చెప్పారు. ఇన్నాళ్లు తన సహనాన్ని చూశారని.. ఇక నుంచి యుద్ధమేనని అన్నారు. వైసీపీలో నీచుల సమూహం ఎక్కువగా ఉందని.. ప్రజల గురించి పట్టించుకునే నాయకుడే లేరని పవన్ కల్యాణ్ మండిపడ్డారు.
“రాయలసీమ వెనుకబడుతోందని.. వెనుకబడే ఉందని మాట్లాడే నాయకులు.. అసలు ఆంధ్రాకు ముఖ్యమంత్రులు వచ్చిందే రాయలసీమ నుంచి కదా. మరి ఇన్నేళ్లు ఏం చేశారు. రాయలసీమను అభివృద్ధి చేయకుండా ఈ సీఎంలు చేసిందేంటి. కొందరు వైసీపీ నాయకులు సన్నాసుల్లా ప్రవర్తిస్తున్నారు. వెధవల్లా వ్యవహరిస్తున్నారు. రండి.. రాడ్లతో హాకీ స్టిక్కులతో దేంతో వస్తారో రండి. గూండాల్లా ప్రజల మీద తెగబడుతున్న వైసీపీ నాయకుల తోలు ఒలిచేస్తాం. ఇప్పటి వరకు నా సహనం చూశారు. ఇక నుంచి నా భావ ప్రకటనను నేను స్వేచ్ఛగా ప్రకటిస్తాను.” – పవన్ కల్యాణ్