విద్యార్ధినికి న్యాయం జరగకపోతే కర్నూలులో జ్యుడిషియల్ కేపిటల్ పెట్టి ఎం లాభామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. సుగాలి ప్రీతీ అత్యాచార ఘటనలో న్యాయం జరగాలని పవన్ కళ్యాణ్ ప్రస్తుతం కర్నూలు పర్యటనకు వెళ్ళిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ కీలక వ్యాఖ్యలు చేసారు. రాయలసీమలో ఆడబిడ్డకు అన్యాయం జరిగితే జగన్ ఎందుకు స్పందించడం లేదన్నారు.
ప్రభుత్వం స్పందించకపోతే మానవహక్కుల సంఘాన్ని ఆశ్రయిస్తామని అన్నారు. చట్టాలు బలహీనులకు బలంగా పని చేస్తాయని అన్నారు. చంద్రబాబు పాలనలో ఘటన జరిగితే మీరేం చేసారని ప్రశ్నించారు. పోలీసులపై నమ్మకం ఉంది లేదంటే కేసుని సిబిఐకి అప్పగించాలని అన్నారు. లేకపోతే తానే సిబిఐ లేఖ రాస్తా అన్నారు. బాలిక హత్య కేసు నిందితులను శిక్షించాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేసారు.
విద్యాసంస్థల్లో విద్యార్ధులకు రక్షణ లేకపోతే ఎలా అన్నారు. కేసు సిబిఐ కి అప్పగించకపోతే తాను కర్నూలులో నిరాహార దీక్ష చేస్తా అని హెచ్చరించారు. స్కూల్ నుంచి రావాల్సిన పిల్లను అత్యాచారం చేసి చంపేశారని, ఈ కేసులో తప్పు రాజకీయ నేతలదే అని పవన్ ఆరోపించారు. సత్వర న్యాయం జరగాలని డిమాండ్ చేసారు. ప్రీతీ తల్లి కూడా ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసారు. నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు.