ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న వరుస సంఘటనల నేపథ్యంలో జనసేన పార్టీ స్పందించింది.మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలకు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని, పోలీస్ స్టేషన్ లో జాప్యం జరుగుతుందని ఆరోపించింది. అధికార పార్టీ నాయకుడు అప్పు చెల్లించలేదని ఓ గిరిజన మహిళను అత్యంత దారుణంగా ట్రాక్టర్ కింద తొక్కించి చంపేస్తే పోలీసులు జాప్యం చేశారని, రాష్ట్రంలో చట్టాలు చేసి వాటిని ప్రచారం చేయడం తప్ప అమలు చేయడం లేదని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. సత్తెనపల్లి లాంటి గ్రామంలో జరిగిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తం గా విషాదంలో పడేసిందని ఇప్పటికైనా అధికార ప్రభుత్వం స్పందించాలని కోరారు.
గిరిజన కుటుంబం పై దుర్మార్గంగా అధికార పార్టీ నాయకులు ప్రవర్తించడం, వారిని ఎవరూ ప్రశ్నించుకోవడం అనేక అనుమానాలకు దారి తీస్తుందని, రాష్ట్రంలో చట్టాలు అమలు అవుతున్నాయా లేదా అని ప్రశ్న ప్రతి ఒక్కరి మనసులో కలుగుతుందని జనసేన ప్రశ్నించింది. రాష్ట్రంలో లో కాదు దుర్మార్గంగా అత్యాచార ఘటనలో జరుగుతున్నప్పుడు దిశా చట్టం ఏమైందని ప్రశ్నించారు.దిశా చట్టం తీసుకు వచ్చినప్పుడు ఎంతో గొప్పగా ప్రచారం చేసి అమలు చేయడంలో ఎందుకు వెనుకబడి ఉన్నారని ఆక్రోశించారు.
చట్టాలపై ప్రచారం తప్ప మహిళల మానప్రాణాలకు రక్షణ ఏదీ? – JanaSena Chief Sri @PawanKalyan pic.twitter.com/rSyulRZyFF
— JanaSena Party (@JanaSenaParty) August 4, 2020