ఇటీవల పవన్ కళ్యాణ్ మరియు సాయి తేజ్ లు నటించిన చిత్రం బ్రో.. థియేటర్ లలో చక్కగా ప్రదర్శితం అవుతోంది. ఇప్పటికే 100 కోట్లకు పైగా కలెక్ట్ చేసి వరుసగా పవన్ చేసిన మూడు రీమేక్ సినిమాలు 100 కోట్లకు పైగా కలెక్ట్ చేసిన రికార్డ్ సాధించాయి. కాగా ఇందులో పృథ్వి చేత పబ్ లో డ్యాన్స్ వేయించిన సీన్ ఎన్నో వివాదాలను సృష్టించింది. ఈ విషయంపైన మంత్రి అంబటి రాంబాబు చాలా గోల చేస్తున్నారు. ఈ విషయంపై జనసేన నాయకులు సైతం అంబటి రాంబాబు ను విమర్శించి వార్తల్లో కెక్కుతున్నారు. ఈ వివాదంపై తాజాగా పవన్ స్పందించారు. ఈయన మాట్లాడుతూ రాజకీయాలను రాజకీయాలుగానే చూడండి, ఇక్కడకు సినిమాను తీసుకురాకండి అంటూ హెచ్చరించారు. నేను రాజకీయంగా నడవాలంటే నాకు సరైన ఇంధనం సినిమానే అంటూ కుండబద్దలు కొట్టినట్లు చెప్పాడు పవన్. నా సినిమాల గురించి వైసీపీ నేతలు మాట్లాడుతారు అది కేవలం సమస్యను డైవర్ట్ చేయడానికి మాత్రమే..
ఇది గుర్తించకుండా మీరు కూడా ఎందుకు ఈ విషయాల గురించి మాట్లాడుతున్నారు అంటూ పవన్ జనసైనికులను ఉద్దేశించి మాట్లాడారు. బ్రో ఒక సినిమా మాత్రమే దాని గురించి మీరెవ్వరూ మాట్లాడొద్దు అంటూ ఆదేశించారు పవన్.