మహేష్ కు గిఫ్ట్ పంపిన పవన్…అందులో ఏముందంటే..?

-

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పండగల‌ వేళ ఇతర సందర్భాల్లో తన స్నేహితులకు గిఫ్ట్ లు పంపి సర్ప్రైజ్ చేస్తారన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లోనే పవన్ కళ్యాణ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కు గిల్ఫ్ట్ పంపి సర్ప్రైజ్ చేశారు. పవన్ దీపావళి సందర్భంగా ఈ గిఫ్ట్ బాక్స్ ను పంపినట్టు తెలుస్తోంది. ఇక ఈ గిఫ్ట్ లో పర్యావరణ హితమైన టపాసులు మరియు స్వీట్ లు ఉన్నట్టు కనిపిస్తోంది. పవన్ కల్యాణ్ గిఫ్ట్ పంపిన విషయాన్ని మహేష్ బాబు సతీమణి నమ్రత సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

గిఫ్ట్ పంపిన పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు చెప్పారు. పవర్ స్టార్ మహేష్ బాబు కు మాత్రమే కాకుండా దర్శకులు హరీష్ శంకర్ మరియు క్రిష్ లకు సైతం గిఫ్ట్ లు పంపారు. ప్రస్తుతం పవన్ క్రిష్ దర్శకత్వం లో హరిహర వీరమల్లు అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక హరీష్ శంకర్ దర్శకత్వం లోనూ పవన్ కళ్యాణ్ భవదీయుడు భగత్ సింగ్ అనే సినిమాలో నటిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news