టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు రాజకీయాలలో బిజీబిజీగా గడుపుతున్నారు. క్షణం తీరిక లేకుండా బిజీగా ఉన్నా పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికలలో ఎలా అయినా సరే విజయం సాధించాలి అని ఆ దిశగా అడుగులు వేస్తూ రాజకీయాలలో ఫుల్ యాక్టివ్ గా పాల్గొంటున్నారు. అంతేకాకుండా సినిమాలకు వరుసగా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. ప్రస్తుతం పవర్ స్టార్ చేతిలో నాలుగు సినిమాలు ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ సినిమాల కంటే ఎక్కువగా రాజకీయాలపై ఎక్కువ శ్రద్ధను చూపిస్తున్నారు.
ఇదిలా ఉంటే రాజకీయ ప్రచారాలు లేనప్పుడు సినిమా లో నటిస్తూ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇకపోతే పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్న లేజినోవా ప్రస్తుతం రష్యాలో ఉన్న విషయం తెలిసిందే. ప్రతి ఏడాది క్రిస్మస్ అక్కడే సెలబ్రేట్ చేసుకొని ఆ తర్వాత ఆమె ఇండియాకి వస్తూ ఉంటుంది. పవన్ కళ్యాణ్ కూడా ప్రతి ఏటా తనతో పాటు వెళ్లి క్రిస్మస్ వేడుకలలో భాగంగా రష్యాలో ఉంటారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇది ఇలా ఉండగా ఈ ఏడాది కూడా పవన్ కళ్యాణ్ రష్యా వెళ్లబోతున్నాడా అంటే కష్టమే అంటూ కూడా వార్తలు వినిపించాయి. దాంతో అన్నా లెజినోవా అతనితో గొడవ పడిందని వార్తలు కూడా వైరల్ అయ్యాయి.
అయితే భార్యను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఆమె అలక తీర్చడానికి పండుగ కేవలం రెండు రోజులే కాబట్టి వెళ్లి రావొచ్చు అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. కొంతమంది పవన్ కళ్యాణ్ ఆల్రెడీ రష్యా కి బయలుదేరాడు అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా భార్య ఫీలింగ్స్ అర్థం చేసుకొని ఆమె అలక తీర్చడానికి పవన్ కళ్యాణ్ రష్యా వెళ్తుండడంపై ప్రతి ఒక్కరు ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు.