ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయోమయంలో ఉన్నట్లు కనిపిస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికలలో గాజువాక, భీమవరం నియోజకవర్గాల నుండి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ పరాజయం పాలైన సంగతి తెలిసిందే. దీంతో మరోసారి అలాంటి పరాభవం ఎదురు కాకుండా ఉండేందుకు ఇప్పటినుండే కసరత్తులను ప్రారంభించారు.
అయితే ఈసారి ఏ నియోజకవర్గము నుంచి పోటీ చేస్తే గెలుపు సొంతం అవుతుందనే దాని మీద వ్యూహాలను రచిస్తున్నాడు. అయితే ఏడు నుంచి ఎనిమిది నియోజకవర్గాలలో అనుకూల ,ప్రతికూల పరిస్థితుల గురించి తెలుసుకున్నారు. కాకినాడలో డివిజన్ల వారీగా నేతలు, కార్యకర్తలతో సమావేశం అయ్యారు. సిటీలోని 50 డివిజన్లలో 28 డివిజన్ల పెద్దలతో కూడా మంతనాలు జరిపారు.కాకినాడ నియోజకవర్గంలో జనసేన క్యాడర్ బలంగా ఉందని జనసేన కార్యకర్తలు పవన్ దృష్టికి తీసుకెళ్లారట. అక్కడ సామాజిక వర్గం కూడా కలిసి వస్తుండడంతో కాకినాడ నుంచి పోటీ చేయుటకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.