తెలుగు సినీ ఇండస్ట్రీకి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఉన్న సినిమా టికెట్ల ధరల వివాదాన్ని జగన్ ప్రభుత్వం ఇటీవలే తెర వేసింది. సినిమా టికెట్ల ధరలను పెంచుతూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జీవో ను విడుదల చేసింది. ఈ జీవోతో వివాదానికి తెర పడిందని ప్రభుత్వ పెద్దలు భావించారు. అయితే అప్పుడే మరో వివాదం తెర పైకి వచ్చింది. జగన్ ప్రభుత్వం.. సినిమా టికెట్ల ధరలను పెంచుతు జీవో విడుదల చేయాలని భావించినప్పటికి ఆలస్యం చేసిందనే వాదన ఉంది. అయితే ఇటీవల పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా విడుదల అయింది.
కాగ ఈ సినిమాకు ఆటంకం కలిగించేలా రాష్ట్ర ప్రభుత్వం నానా హంగామాలు చేసింది. చరిత్రలో మొదటిసారి సినిమా థీయేటర్ల వద్దకు వీఆర్వో నుంచి కలెక్టర్ వరకు అధికారులను దించింది. భీమ్లా నాయక్ సినిమాకు అనేక ఇబ్బందులు పెట్టింది. అలాగే రాష్ట్ర ప్రకటించబోయే జీవో ను కూడా ఆలస్యం చేసింది. కాగ దీనిపై మనలోకం ట్విట్టర్ లో ఒక పోల్ నిర్వహించింది. పనవ్ కళ్యాణ్ సినిమాకు పేదులుగా ఉన్న ఆంధ్రులు .. ప్రభాస్ సినిమాకు ధనవంతులు అయిపోయారా.. అంటూ పోల్ నిర్వహించింది.
ఈ పోల్ నెటిజన్లు జగన్ ప్రభుత్వానికి దిమ్మతిరిగే సమాధానం ఇచ్చారు. పవన్ పై కుట్రలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ఇలా వ్యవహరించిందని నెటిజన్లు తేల్చారు. ఈ పోల్ దాదాపు 75 శాతం మంది నెటిజన్లు పవన్ వైపే నిలిచారు. పవన్ పై కుట్ర పూరితంగా ఏపీ ప్రభుత్వం ఉంటుందని నెటిజన్లు కామెట్ల రూపంలో ఆరోపించారు.
పవన్ కళ్యాణ్ సినిమాకి పేదలుగా ఉన్న ఆంధ్రులు..
ప్రభాస్ సినిమాకి ధనవంతులు అయిపోయారా..#PawanaKalyan #Prabhas𓃵— Manalokam (@manalokamsocial) March 8, 2022