తెలంగాణ ధైర్యాన్ని ఇచ్చింది.. దెబ్బకొట్టే కొద్దీ ఎదుగుతా- పవన్

తెలంగాణ గడ్డ నాకు ధైర్యాన్ని ఇచ్చిందని.. దెబ్బకొట్టే కొద్దీ మరింత ఎదుగుతానని జన సేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఇవాళ తెలంగాణ జనసేన నేతలతో పవన్ కళ్యాణ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా.. బలమైన మార్పు కోసం పోరాటం చేస్తానని.. హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వరకు 2009 లో తాను తిరిగానని వెల్లడించారు. ఓడిపోయినా ప్రజల కోసం పోరాటం చేస్తానని పేర్కొన్నారు పవన్.

pawankalyan
pawankalyan

రాజకీయ చదరంగంలో ఒక్క అడుగైనా ఆలోచనతో ముందుకు వెయ్యాలని తెలిపారు. అన్నింటికీ సిద్ధపడే రాజకీయాల్లోకి వచ్చానని పేర్కొన్న పవన్ కళ్యాణ్… రాజకీయాల్లో డబ్బుతో- పేరుతో పని లేదని.. కేవలం బలమైన భావజాలం ఉంటే చాలు అని వెల్లడించారు. మార్పు కోసం వచ్చిన పార్టీ జనసేనా అని పవన్ కళ్యాణ్ తెలిపారు. తెలంగాణ గడ్డకు తాను ఋణగ్రస్తున్ని అని.. తెలంగాణ పోరాట స్ఫూర్తినే తనను ఇవ్వాళ ఇక్కడి వరకు తెచ్చిందని స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్. ప్రజల కోసం ఎంతటి పోరాటాల కైనా సిద్దామన్నారు.