పవన్ తొలివిడుత ఎన్నికల ప్రచారం షెడ్యూల్ ఖరారు

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు చాలా రసవత్తరంగా మారాయి. ఇప్పటికే అధికార వైసీపీ అన్నీ స్థానాలను ప్రకటించింది. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి కేవలం కొన్ని స్థానాలను మాత్రమే పెండింగ్ లో పెట్టింది. ఇవాళ కూడా టీడీపీ కొన్ని స్థానాలను ప్రకటించింది. 3 స్థానాలు మాత్రమే పెండింగ్ లో ఉన్నాయి. అవి ఎవరెవరికీ అనేది మాత్రం అత్యంత త్వరలోనే క్లారిటీ రానుంది. అభ్యర్థులను ప్రకటించిన స్థానాల్లో ఇప్పటికే ప్రచారాలు ముమ్మరం చేస్తున్నారు.

ఇక జనసేనాని పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో వేగం పెంచనున్నారు. రేపటి నుంచి 10 నియోజకవర్గాల్లో ఆయన భారీ బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. మార్చి 30 నుంచి ఏప్రిల్ 02 వరకు నాలుగు  రోజుల పాటు పాటు తాను పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ప్రచారం చేస్తారు పవన్ కళ్యాణ్. మార్చి 03న తెనాలి, మార్చి 04 నెల్లిమర్ల, మార్చి 05న అనకాపల్లి, మార్చి 06న యలమంచిలి, మార్చి 07న పెందుర్తి, మార్చి 08న కాకినాడ, మార్చి 09న పిఠాపురం, మార్చి 10న రాజోలు, మార్చి 11న గన్నవరం, మార్చి 12న రాజానగరం సభల్లో పవన్ ప్రసంగించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news