బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన నటి పాయల్ ఘోష్ న్యాయవాది నితిన్ ఆమెకు వై స్థాయి భద్రత కల్పించాలని కోరుతూ మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్‌కు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా పాయల్ న్యాయవాది అసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిందితుడు స్వేచ్ఛగా తిరుగుతున్నాడని, అతన్ని ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదని ఆరోపించారు.
ఇలా అతన్ని స్వేచ్ఛగా వదిలేస్తే అతని వల్ల తన క్లైంట్‌కు హాని కలిగే అవకాశం వుందని ఈ విషయంలో మహారాష్ట్ర సర్కారు స్పందించాలని డిమాండ్ చేశారు. ఇటీవల పాయల్ ఘోష్ మహారాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్ కోష్యారీని కలిసి తనకు ప్రాణ హానీ వుందిన, వై కేటగిరి భద్రతను కల్పించాలంటూ విజ్ఞప్తి చేసింది. అయితే గవర్నర్ నుంచి కానీ మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి పాయల్ విషయంలో ఎలాంటి స్పందన రాలేదు. దీంతో పాయల్ ఘోష్ రాయర్ మరోసారి మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్‌కు లేఖ రాయడం ఆసక్తికరంగా మారింది.