ఈ పేమెంట్‌ బ్యాంక్‌లో ఎస్‌బీఐ కంటే ఎక్కువ వడ్డీ!

-

సాధారణంగా అందరూ డబ్బులు ఆదా చేసి.. బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసేది, దానికి వడ్డీ వస్తుందని. అంతేకాదు ఇందులో ఏ రిస్క్‌ ఉండదు కూడా. అయితే, అందరిMీ ఆమోదమైన ఇన్వెస్ట్‌మెంట్‌ ఆప్షన్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ స్కీం. దేశవ్యాప్తంగా ఎక్కువ మంది డిపాజిటర్లు మొగ్గు చూపేది ఈ స్కీంపైనే. అయితే ఈ స్కీం ద్వారా వివిధ బ్యాంకులు వివిధ వడ్డీ రేట్లను ప్రకటిస్తాయి. అందులో సీనియర్‌ సిటిజెన్స్‌కు కాస్త ఎక్కువ వడ్డీని అందిస్తుంది.

అంతేకాదు కొన్ని ప్రత్యేక సమయాల్లో అంటే ఉమెన్స్‌ డే వంటి దినాల్లో మహిళలకు కూడా ప్రత్యేక వడ్డీ పథకాన్ని అందుబాటులోకి తెస్తుంది. సాధారణంగా డబ్బులు పెట్టుబడి పెట్టేప్పుడు ఏ బ్యాంక్‌ ఎక్కువ వడ్డీ ఇస్తుందో పరిశీలించాలి. ఎందుకంటే ప్రభుత్వ బ్యాంకులే కాకుండా కొన్ని ప్రైవేటు బ్యాంకులు కూడా ఎక్కువ వడ్డీని ప్రకటిస్తున్నాయి.

ఈ జాబితాలో మనం మొదటగా తెలుసుకోవాల్సింది.. పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌. ఈ పేమెంట్స్‌ బ్యాంక్‌ తాజాగా ఓ ఎఫ్‌డీ పథకాన్ని పరిచయం చేసింది. ఇందులో వంద కంటే తక్కువ డిపాజిట్‌తోనే అకౌంట్‌ తెరవచ్చు. అందేకాదు వ్యవధి అవ్వకముందే డబ్బులు మొత్తం విత్‌డ్రా చేసుకున్నా.. ఎటువంటి అదనపు ఛార్జీలు వసూలు చేయదు. ఈ విధానానికి పేటీఎం ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌తో జతకట్టింది. ఈ ఎఫ్‌డి స్కీమ్‌ మెచ్యూరిటీ పీరియడ్‌ 356 రోజులు. ఆ తర్వాత స్కీమ్‌ ఆటో రెన్యువల్‌ అవుతుంది. మీ ఎఫ్‌డీ పెట్టుబడిపై అత్యధికంగా 6 శాతం వడ్డీ రేటు అందిస్తుంది.

ఎస్‌బీఐ అందించే వడ్డీ రేటు కంటే ఈ వడ్డీ ఎక్కువనే చెప్పవచ్చు. ఇది వినియోగదారులను ఎంతగానో ఆకర్షించే విషయం. దీనిలో 7 రోజుల కనిష్ట వ్యవధి నుంచి ఏడాది వరకు పెట్టుబడి పెట్టవచ్చు. అయితే, మెచ్యూరిటీ ముగిసేలోపు ఎప్పుడు విత్‌డ్రా చేసుకున్నా సరే.. మీ పెట్టుబడి మొత్తానికి వడ్డీతో కలిపి వెంటనే చెల్లిస్తారు. అయితే, మీకు రావాల్సిన మొత్తంలో నుంచి టీడీఎస్‌ను కట్‌ చేస్తారు. పేటీఎం పేమెంట్‌ బ్యాంక్‌లో కూడా ఎఫ్‌డీ చేసే సీనియర్‌ సిటిజన్లకు అదనపు వడ్డీ లభిస్తుంది. ఇతర కస్టమర్లతో పోలిస్తే వీరు అదనంగా 0.5% వడ్డీ అందిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news