పేటీఎంలో టికెట్లు బుక్ చేసుకునేవారికి అదిరిపోయే గుడ్ న్యూస్‌..!!

-

ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌ల‌కు క‌రోనా వైర‌స్ విశ్వ‌రూపం చూపిస్తుంది. క‌రోనా మ‌హ‌మ్మారి ముందు ఎంత‌టి బ‌ల‌వంతుడైనా త‌ల దించాల్సి వ‌స్తుంది. చైనాలోని వూహాన్‌లో పుట్టుకొచ్చిన ఈ ప్రాణాంత‌క‌ర వైర‌స్‌కు వ్యాక్సిన్ లేక‌పోవ‌డంతో.. అటు ప్ర‌జ‌లు, ఇటు ప్ర‌భుత్వాలు తీవ్ర స‌వాళ్లు ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. వివిధ ర‌కాల జ‌బ్బుల‌కు సంబంధించిన మందుల‌ను, భిన్న‌మైన డోస్‌ల్లో వాడుతూ క‌రోనాను కాస్త క‌ట్ట‌డి చేస్తున్నారు. మ‌రోవైపు క‌రోనా వ్యాక్సిన్ కోసం ప్ర‌పంచ‌దేశాల శాస్త్ర‌వేత్త‌లు ఎన్నో ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి.

ఇక ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌వ్యాప్తంగా కరోనా కేసులు 20 లక్షలకు చేరువలో ఉన్నాయి. 1.20 మందికిపైగా క‌రోనాతో పోరాడి ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ మ‌హ‌మ్మారిని మ‌ట్టుపెట్టేందుకు ప‌లు దేశాలు లాక్‌డౌన్ విధించాయి. దీంతో ప్ర‌జ‌లు ఎక్క‌డిక‌క్క‌డే లాక్ అయ్యారు. ఇక నిన్న‌టికి నిన్న భార‌త్‌లో ప్ర‌ధాని మోదీ లాక్‌డౌన్ పొడిగించ సంగ‌తి తెలిసిందే. దీంతో ప్ర‌జ‌ల‌తో పాలు ర‌వాణాశాఖ కూడా స్తంభించిపోయింది. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు బుక్ చేసుకున్న టికెట్లు ర‌ద్దు అయ్యాయి. దీని వ‌ల్ల టికెట్ క్యాన్స‌లేష‌న్‌కు రీఫండ్ ఛార్జీలు వ‌సూల్ చేస్తారు.

అయితే ఇలాంటి స‌మ‌యంలో పేటీఎం ఓ అదిరిపోయే గుడ్ న్యూస్ అందించింది. ఏంటంటే.. తెలంగాణ ఆర్‌టీసీ, ఏపీఎస్ఆర్‌సీటీసీతో పాటు ఇతర రాష్ట్రాల ప్రభుత్వ బస్సులు, ప్రైవేట్ బస్సుల్లో టికెట్లు బుక్ చేస్తే వారికి ఫ్రీ క్యాన్సలేషన్ సదుపాయం కల్పిస్తోంది పేటీఎం. పేటీఎం ట్రావెల్‌లో ఎవరైనా బస్సు టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఒకవేళ ఏవైనా స‌మ‌స్య‌ల వ‌ల్ల‌ ప్రయాణాల్లో మార్పులు ఉంటే టికెట్లు క్యాన్సిల్ చేసుకోవ‌చ్చు. ఎలాంటి క్యాన్సలేషన్ ఛార్జీలు లేకుండా వారికి పూర్తి రీఫండ్ వస్తుంది. ఫ్రీ క్యాన్సలేషన్ నియమనిబంధనలు గురించి మ‌రిన్ని వివ‌రాలు పేటీఎం యాప్‌లో చూడొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news