బ్రేకింగ్ : ఆస్పత్రిలో చేరిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే

అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి కి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. గత రెండు రోజులుగా కరోనా లక్షణాలతో… ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే బుధ వారం కరోనా పరీక్షలు చేయించుకున్నారు. అయితే.. ఈ పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

కరోనా పాజిటివ్‌ రావడంతో …ఆస్పత్రి లో చేరారు ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌ లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రి లో కరోనా చికిత్స పొందుతున్నారు. ఇక ఈ మధ్య కాలంలో తన ను కలిసిన వారంతా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి సూచించారు. కాగా… తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే చాలా మంది ప్రముఖులు, రాజకీయ నాయకులకు కరోనా మహమ్మారి సోకిన విషయం తెలిసిందే. ఇక అటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు అదుపులోకి వస్తున్నాయి.