సోషల్ మీడియాలో తమ ఫాలోవర్స్ పెరగాలని చాలా మంది వివిధ ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు ఫన్నీ వీడియోలు చేస్తే… మరికొందరు చిలిపి ష చేష్టలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తారు. ఎలాగైన నెటిజన్ల దృష్టిని తమవైపు తిప్పుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తారు. ఇలాగే అమెరికాలో కూడా ఓ మహిళ ఇలానే చేసింది. ఈ చర్య వలన ఆమె భర్త విడాకులు ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. టిక్‌టాక్ వీడియోల ఫాలోవర్స్ పెరగాలని తన భర్య పిల్లలను హింసిస్తోందని పేర్కొన్నాడు. ఓ నివేదిక ద్వారా ఆ ఆన్‌లైన్ చర్చ పెట్టాడు.
టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోలు చేయడం ద్వారా తన భర్య సోషల్ మీడియాలో ఫేమస్ కావాలని రోజూలు వీడియోలు చేస్తుండేదన్నారు. హద్దులను దాటి ప్రవర్తించడం తాను గమనించినట్టు తెలిపారు. ఫన్నీ వీడియోల పేరిట ఆమె తన ఆరేళ్ల కూతురు, ఏడాది కుమాడిని ఇబ్బందులు పెడుతుందన్నారు. టిక్ టాక్ వీడియో కోసం తన కుతురిని హింసించిందని ఆరోపించారు. తన పిల్లలు ఏడవడం చూశానని చెప్పాడు. ఈ వీడియోలు చేసినప్పుడు తీవ్రంగా బాధపడ్డానని సదరు భర్త ఆవేదన వ్యక్తం చేశాడు.
తాను ఎన్నిస్లారు సర్ది చెప్పాలని ప్రయత్నించినా విన్నడం లేదని, మానుకోవడం లేదని పేర్కొన్నాడు. తల్లితో కలిసి తమ పిల్లలు పడుకోవాలంటే భయపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కారణాల వలనే తన భర్యకు విడాకులు ఇవ్వాలని నిర్ణయించినట్టు చెప్పాడు. తన కుమాడినితో ఓ వీడియో చేసే క్రమంలో వాడు చాలా భయపడిపోయాడని పేర్కొన్నారు. అయినా వీడిచిపెట్టకుండా వీడియో చేసిందని భర్త మండిపడ్డాడు. ఇలాంటి భర్యకు విడాకులు ఇవ్వకుండా ఎలా కలిసి ఉండామంటారని ప్రశ్నించాడు.
సోషల్ మీడియాతో సమచారాన్ని సేకరించడం. మనకు తెలిసింది వేరే వారికి చెప్పడం మంచిదే.. అంతేకాకుండా ఫాలోవర్స్ కోసం ఇతరులు ఇబ్బంది పడే విధంగా ఉండొద్దు ఇలా చేయడం వలన కుటుంబంలో సమస్యలతో పాటు సమాజంలో చెడు భావన కలుగుతుంది.